పాంబన్ బ్రిడ్జిపై రైలుబండి

తమిళనాడులో చిట్టచివరి ప్రాంతం రామేశ్వరానికి కొత్త రైలు బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. కొత్తగా నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. శ్రీరామ నవమి పండగను పురస్కరించుకుని ఈ వంతెనను జాతికి అంకితం చేశారు. దీనితోపాటు తాంబరం- రామేశ్వరం మధ్య కొత్తగా ప్రవేశపెట్టిన ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసునూ ఆయన జెండా ఊపి ప్రారంభించారు.

మూడు రోజుల థాయ్‌లాండ్, శ్రీలంక పర్యటలను ముగించుకుని ఈ ఉదయం భారత్‌కు చేరుకున్నారాయన. శ్రీలంక నుంచి భారత నౌకాదళానికి చెందిన ఎంఐ 17 ఛాపర్‌లో నేరుగా రామేశ్వరానికి వచ్చారు. మండపం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయ్యారు.

PM Narendra Modi inaugurates New Pamban Bridge and flags off Rameswaram-Tambaram express

కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, ఎల్ మురుగన్, తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి, కొందరు మంత్రులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం పాంబన్ బ్రిడ్జి వద్ద ఏర్పాటుచేసిన వేదిక వద్దకు చేరుకున్నారు. రిమోట్‌తో ఈ వంతెనను ప్రారంభించారు. ఆ వెంటనే- ఆ వంతెన వర్టికల్‌గా 72 మీటర్ల ఎత్తుకు వెళ్లింది. నౌకలు రాకపోకలు సాగించడానికి ఈ ఏర్పాటు చేశారు.

మొత్తం 8,300 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించారు. తాంబరం- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపారు. వాలాజపేట- రాణిపేట, విల్లుపురం- పుదుచ్చేరి, పూండియాన్‌కుప్పం- సత్యనాథపురం, చోళపురం- తంజావూరు సెక్షన్ల మధ్య నాలుగు లేన్ల జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ ఉదయం వరకు శ్రీలంక పర్యటనలో ఉన్నారు ప్రధాని మోదీ. ఆ దేశాధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకెతో కలిసి చారిత్రాత్మక జయశ్రీ మహాబోధి ఆలయాన్ని సందర్శించారు. అనూరాధపురం రైల్వే స్టేషన్‌ కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన అత్యాధునిక రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ, మహో- ఒమన్‌థాయ్ రైల్వే లైన్‌ను ప్రారంభించారు. అక్కడి నుంచి నేరుగా రామేశ్వరానికి వచ్చారు ప్రధాని.

PM Narendra Modi inaugurates New Pamban Bridge and flags off Rameswaram-Tambaram express

తాంబరం- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ మొట్టమొదటి సారిగా దీని మీదుగా రాకపోకలు సాగించనుంది. సాయంత్రం 6:10 నిమిషాలకు తాంబరం నుంచి బయలుదేరే నంబర్ 16103 ఎక్స్‌ప్రెస్.. మరుసటి రోజు తెల్లవారు జామున 5:40 నిమిషాలకు రామేశ్వరం చేరుకుంటుంది.

మళ్లీ సోమవారం సాయంత్రం రామేశ్వరం నుంచి బయలుదేరే నంబర్ 16104 రైలు.. ఆ మరుసటి రోజు తెల్లవారు జామున 3:45 నిమిషాలకు తాంబరం స్టేషన్‌కు చేరుకుంటుంది. చెంగల్పట్టు, విల్లుపురం, తిరుప్పదిపులియూర్, చిదంబరం, మైలాడుథురై, తిరువారూర్, తిరుత్తురైపూండి, పట్టుకోట్టై, అరంథంగి, కారైకుడి, శివగంగ, మనమధురై, పరమక్కుడి, రామనాథపురం మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+