‘ఇంటర్నెట్‌ స్టార్‌’: టుస్సాడ్స్‌లో మోడీ, ఫోజులిచ్చారిలా

న్యూఢిల్లీ: ప్రపంచోలని రాజకీయ నాయకులు, చారిత్రక వ్యక్తులు, సెలబ్రిటీల సరసన భారత ప్రధాని నరేంద్రమోడీ త్వరలో చేరనున్నారు. మైనపు విగ్రహాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేడమ్ టుస్సాడ్స్‌లో మోడీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆయన విగ్రహాన్ని లండన్‌తో పాటు సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాగ్ శాఖల్లో కూడా ఏర్పాటు చేయనుంది.

ప్రజలకు నమస్కరిస్తున్నట్లుగా ఉండే ప్రధాని మోడీ మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిపుణులు రూపొందించనున్నారు. ఈ సందర్భంగా మ్యూజియం నిపుణులు వివిధ భంగిమల్లోని మోడీ కొలతలను తీసుకున్నారు. మ్యూజియంలో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖుల విగ్రహాల సరసన తన విగ్రహాన్ని ఏర్పాటు చేసే విషయంపై మోడీ సందేహం కూడా వ్యక్తం చేశారు.

'ప్రజల మనోభావాల మేరకు మీరు ఈ నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు కనుక నాకు అభ్యంతరం లేదు' అని ఈ సందర్భంగా ప్రధాని మోడీ మ్యూజియం వర్గాలతో వ్యాఖ్యానించారు. అంతేకాదు గతంలో తాను మూడు, నాలుగు సార్లు టుస్సాడ్స్ మ్యూజియంను సందర్శించానని చెప్పారు.

వృత్తి పట్ల అంకిత భావం, కళా నైపుణ్యం ఎంతో ప్రశంసనీయమని కూడా మోడీ మ్యూజియం వర్గాలతో వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ తన సహజసిద్ధ శైలిలో అంటే క్రీమ్ కలర్ కుర్తా, దానిపై జాకెట్ ధరించి నమస్కరిస్తున్నట్లుగా ఆయన మైనపు విగ్రహాన్ని రూపొందిస్తున్నారు.

 ‘ఇంటర్నెట్‌ స్టార్‌': టుస్సాడ్స్‌లో మోడీ, ఫోజులిచ్చారిలా

‘ఇంటర్నెట్‌ స్టార్‌': టుస్సాడ్స్‌లో మోడీ, ఫోజులిచ్చారిలా

ఈ విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియానికి ఆసియా, యూరప్ శాఖల్లో ఉంచనున్నట్లు మ్యూజియం వర్గాలు వెల్లడించాయి. మైనపు విగ్రహానికి సంబంధించి ప్రధాని మోడీ సిట్టింగ్స్‌కు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. కాగా, మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు ప్రపంచవ్యాప్తంగా 20 నగరాల్లో శాఖలు ఉన్నాయి.

 ‘ఇంటర్నెట్‌ స్టార్‌': టుస్సాడ్స్‌లో మోడీ, ఫోజులిచ్చారిలా

‘ఇంటర్నెట్‌ స్టార్‌': టుస్సాడ్స్‌లో మోడీ, ఫోజులిచ్చారిలా

భారత్‌కు చెందిన జాతిపిత మహాత్మాగాంధీ, ఇందిరా గాంధీ, సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్, సల్మాన్ ఖాన్, కరీనా కపూర్, మాధురీ దీక్షిత్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహాలు ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నెలకొన్న విషయం తెల్సిందే.

 ‘ఇంటర్నెట్‌ స్టార్‌': టుస్సాడ్స్‌లో మోడీ, ఫోజులిచ్చారిలా

‘ఇంటర్నెట్‌ స్టార్‌': టుస్సాడ్స్‌లో మోడీ, ఫోజులిచ్చారిలా

ఇదిలా ఉంటే ఇంటర్నెట్‌లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని మోడీ చోటు దక్కించుకున్నారు. ప్రముఖ టైమ్స్‌ మ్యాగ్‌జైన్‌ విడుదల చేసిన జాబితాలో ఆయన వరసగా రెండో ఏడాదీ స్థానం దక్కించుకున్నారు.
ఆ జాబితాలో మ్యాగజైన్‌ మోడీని ‘ఇంటర్నెట్‌ స్టార్‌' అంటూ ప్రస్తావించింది.

 ‘ఇంటర్నెట్‌ స్టార్‌': టుస్సాడ్స్‌లో మోడీ, ఫోజులిచ్చారిలా

‘ఇంటర్నెట్‌ స్టార్‌': టుస్సాడ్స్‌లో మోడీ, ఫోజులిచ్చారిలా

ర్యాంకులు ఇవ్వకుండా ఆ మ్యాగ్‌జైన్‌ ప్రపంచంలో నెట్టింట్లో అత్యంత ప్రభావవంతులైన 30 మంది వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో మోడీతోపాటు, అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌, టీవీ రియాలిటీ స్టార్‌ కిమ్‌ కర్దాషియాన్, ఆమె భర్త కన్యా వెస్ట్‌, రచయిత్రి జేకే రౌలింగ్‌, ఒలింపిక్‌ మాజీ అథ్లెట్‌ కెయిత్లిన్‌ జెన్నర్‌, సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రోనాల్డో తదితరులు ఉన్నారు.

 ‘ఇంటర్నెట్‌ స్టార్‌': టుస్సాడ్స్‌లో మోడీ, ఫోజులిచ్చారిలా

‘ఇంటర్నెట్‌ స్టార్‌': టుస్సాడ్స్‌లో మోడీ, ఫోజులిచ్చారిలా

టైమ్స్‌ మ్యాగజైన్‌ మోడీ విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి మోడీ ప్రధానిగా వ్యవహరిస్తున్నారని చెప్పింది.

 ‘ఇంటర్నెట్‌ స్టార్‌': టుస్సాడ్స్‌లో మోడీ, ఫోజులిచ్చారిలా

‘ఇంటర్నెట్‌ స్టార్‌': టుస్సాడ్స్‌లో మోడీ, ఫోజులిచ్చారిలా

ట్విట్టర్‌లో 18 మిలియన్ల మంది, ఫేస్‌బుక్‌లో 32 మిలియన్‌ల మంది ఆయనకు ఫాలోవర్లుగా ఉన్నారని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+