మాజీ సీఎం కరుణానిధి ఇంటికి వెళ్లిన ప్రధాని మోడీ, స్వాగతం పలికిన స్టాలిన్, రాజకీయ చర్చలు!

Posted By:
Subscribe to Oneindia Telugu
Narendra Modi in Chennai : PM Meets DMK Chief Karunanidhi

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎం. కరుణానిధిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కలిశారు. సోమవారం చెన్నైలోని గోపాలపురంలోని కురుణానిధి ఇంటికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెళ్లారు. డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోడీని ఇంటిలోకి ఆహ్వానించారు.

ప్రధాని నరేంద్ర మోడీని ఎంకే. స్టాలిన్ తో పాటు కురుణానిధి కుటుంబ సభ్యులు శాలువతో సత్కరించి ఇంటిలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ కరుణానిధితో భేటీ అయ్యి ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ సందర్బంలో ప్రధాని నరేంద్ర మోడీ, కరుణానిధితో కొంత సేపు మాట్లాడారు.

PM Narendra Modi meets DMK Chief Karunanidhi in Gopalapuram house in Chennai

తరువాత కరుణానిధి ఇంటి గుమ్మం వరకు వచ్చి ప్రధాని నరేంద్ర మోడీకి విడ్కోలు పలికారు. ఈ సందర్బంలో ప్రధాని నరేంద్ర మోడీతో డీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మాట్లాడారు. అనంతరం డీఎంకే పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీతో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని స్పష్టం చేశారు.

PM Narendra Modi meets DMK Chief Karunanidhi in Gopalapuram house in Chennai

మర్యాదపూర్వకంగా ప్రధాని నరేంద్ర మోడీ మా నాయకుడు ఎం. కరుణానిధిని కలిశారని, ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీయ్యడానికే వచ్చారని, ఏలాంటి రాజకీయాలు చర్చకు రాలేదని డీఎంకే పార్టీ నాయకులు మీడియాకు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్బంగా గోపాలపురంలోని కరుణానిధి ఇంటి దగ్గర గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
PM Narendra Modi meets DMK Chief Karunanidhi in Gopalapuram house in Chennai in Tamil Nadu.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి