చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత ఇంట్లో భోజనం చేసిన నరేంద్ర మోడీ

|
Google Oneindia TeluguNews

చెన్నయ్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జే. జయలలిత శుక్రవారం మద్యాహ్నం కలిసి బోజనం చేశారు. ఇదే సందర్బంలో పలు విషయాలపై ఇద్దరు సుదీర్ఘంగా చర్చించడంతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి.

PM Narendra Modi meets Tamil Nadu Cm Jayalalithaa in Chennai.

శుక్రవారం నరేంద్ర మోదీ చెన్నయ్ వెళ్లారు. జయలలిత ఆహ్వానాన్ని మన్నించిన ప్రధాని నరేంద్ర మోదీ పోస్ గార్డెన్ లోని ఆమె నివాసం చేరుకున్నారు. ఈ సందర్బంలో మోదీ, అమ్మ అక్కడే బోజనం చేశారు. తరువాత జయలలిత ఒక మొమోరాండాన్ని ప్రధాని మోదీకి అందించారు.

కర్ణాటక, కేరళ రాష్ట్రాలలోని జల వివాదాన్ని జయలలిత ప్రస్తావించారని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అదే సందర్బంలో మోదీ పార్లమెంట్ అమోదం కోసం వేచి ఉన్న భూ సేకరణ బిల్లుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మద్దతు కోరినట్లు సమాచారం.

PM Narendra Modi meets Tamil Nadu Cm Jayalalithaa in Chennai.

సుమారు 50 నిమిషాల పాటు ప్రధాని మోదీ, జయలలిత పలు విషయాలపై చర్చించారు. ప్రధాన మంత్రి అయిన తరువాత నరేంద్ర మోదీ మొదటి సారి తమిళనాడు వెళ్లారు. అదే సమయంలో దక్షిణ భారతదేశంలో ఒక బలమైన నాయకురాలితో ఆయన భేటి కావడంతో రాజకీయంగా చర్చకు దారి తీసింది.

English summary
Prime Minister Narendra Modi on Friday met Tamil Nadu chief minister J Jayalalithaa over lunch at her Poes Garden residence in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X