భారత్‌లో 20 వేల టన్నుల బంగారం: మోడీ
న్యూఢిల్లీ: భారతదేశంలో 20 వేల టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని, ఇంత బంగారం ఉన్న మన భారత్ ఎలా పేద దేశం అవుతందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించారు. మూడు ప్రత్యేక బంగారం డిపాజిట్ల పథకాలను ఆయన గురువారం ప్రారంభించారు.
దేశంలో నిరుపయోగంగా ఉన్న బంగారం ఉపయోగంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. బంగారం నిల్వలను బయటకు తీసి డిమాండ్ ను తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
కార్టూన్ : Modi is world's 9th powerful person-Forbes

బంగారం డిపాజిట్ల పథకాలతో మహిళలు ఆర్థికంగా సాధికారత సాధిస్తారని ప్రధాని నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. కేవలం మహిళల కారణంగానే ఇలాంటి పథకాలు విజయవంతం అవుతున్నాయని స్పష్టం చేశారు.
నేడు భారత్ లోని అనేక ప్రాంతాలలో బంగారాన్ని ఇంట్లో దాచుకుందామన్నా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. డిపాజిట్ పథకంలో బాండ్ల రూపంలో బంగారానికి భద్రత ఉంటుందని ప్రజలకు భరోసాయిచ్చారు.
అనుకోని సందర్బాలలో బాండ్లు చోరీ అయినా దొంగలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన వివరించారు. మహిళలు ఆర్థికంగా పైకి రావడానికి ఈ బంగారు డిపాజిట్ల పథకాలు ఉపయోగపడుతాయని, అందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకుంటారని నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications