దేశానికి ప్రధాని ఐనా..: చైర్లో తల్లిని కూర్చోబెట్టి ఇల్లంతా తిప్పిన మోడీ(పిక్చర్స్)
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి పగ్గాలు చేపట్టి దాదాపు రెండేళ్లవుతోంది. మోడీ ప్రధాని అయిన దాదాపు రెండేళ్ల తర్వాత ఆయన తల్లి హీరాబెన్ తొలిసారి ప్రధాని అధికారిక నివాసానికి వచ్చారు.
తన కుమారుడు, ప్రధాని అయిన మోడీతో ఐదు రోజులు గడిపారు. ఆమెను వీల్ చైర్లో కూర్చో బెట్టుకొని ప్రధాని మోడీ స్వయంగా తన నివాసం అంతా తిప్పి చూపించారు.
ఆమె తిరిగి గుజరాత్‌కు వెళ్లి పోయిన తర్వాత ఆ ఫోటోలను ప్రధాని మోడీ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఉంచారు. చాలా రోజుల తర్వాత అమ్మతో ఆనందంగా గడిపానని, ఆమె తొలిసారి రేస్‌కోర్సులోని అదికారిక నివాసానికి వచ్చారని ట్విట్టర్లో పేర్కొన్నారు.

తల్లితో ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అధికారిక నివాసంలో ఐదు రోజుల పాటు తన తల్లి హీరాబెన్‌తో సంతోషంగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

తల్లితో ప్రధాని మోడీ
ఢిల్లీలోని తన అధికారిక నివాసానికి తొలిసారి వచ్చిన తన తల్లి హీరాబెన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఇల్లంతా తిప్పి చూపించారు. చెట్లను చూపిస్తున్న దృశ్యం.

తల్లితో ప్రధాని మోడీ
ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో ప్రదాని మోడీ తల్లి ఐదు రోజుల పాటు గడిపారు. ఆ తర్వాత గుజరాత్ వెళ్లారు.

తల్లితో ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ తన తల్లికి ఇంటి ఆవరణలోని మొక్కలను దగ్గర ఉండి మరీ చూపించారు. ఆమెను చక్రాల సైకిల్ పైన తోసుకుంటూ పోయారు.












Click it and Unblock the Notifications