రాజీవ్ గాంధీని గుర్తు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం పార్లమెంట్ సమావేశాల్లో రాష్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. రాష్ర్టపతి సణబ్ ముఖర్జీ చెప్పినట్లుగా పార్లమెంట్ లో ఫలప్రదమైన చర్చలు జరగాలని నరేంద్ర మోడీ అన్నారు.

అయితే సభలో జరుగుతున్న పరిణామాల పట్ల దేశ ప్రజలు విరక్తితో ఉన్నారని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల తీరుపై నరేంద్ర మోడీ మండిపడ్డారు. బిల్లులు పాస్ కావడంలో ప్రతిపక్షాలు సహకరించాలని నరేంద్ర మోడీ మనవి చేశారు. ఇదే సమయంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాఖ్యలు గుర్తు చేశారు.

PM Narendra Modi Quotes Rajiv Gandhi on Parliament Disruptions

సభలో ప్రొసీజర్ ను అనుసరిస్తే చర్చలు ఫలప్రదం అవుతాయని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చెప్పారని ఇదే సమయంలో గుర్తు చేశారు. పార్లమెంట్ లో ఓ ప్రధానిలా కాకుండా మొదటి సారి సభలోకివచ్చిన వ్యక్తిగా తన భావాలని వెల్లడించాలని భావిస్తున్నానని నరేంద్ర మోడీ చెప్పారు.

అయితే కేంద్ర మానవవనరుల సహాయ మంత్రి రామ్ శంకర్ కటారియా వివాదస్పద వ్యాఖ్యలపై విరుచుకుపడాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నా కాంగ్రెస్ నాయకులు మాత్రం రామ్ శంకర్ కఠారియా విషయంపై తీవ్ర స్థాయిలో చర్చించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+