అరుదైన గుర్తింపు: మోడీ డ్రీమ్ టీంలో ఫైర్‌బ్రాండ్ ఐఏఎస్ చంద్రకళ

Subscribe to Oneindia Telugu

మీర‌ట్: అక్రమార్కుల పాలిట సింహస్వప్నంలా, క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా నిలుస్తున్న ఐఏఎస్ అధికారి బీ చంద్ర‌క‌ళ మరో అరుదైన అవకాశాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీర‌ట్ జిల్లా మెజిస్ట్రేట్‌గా ఆమె పని చేస్తున్నారు.

ఫైర్ బ్రాండ్

ఫైర్ బ్రాండ్

ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ ఈమెకు ఉంది. ఇప్పుడు ఈమె ప్ర‌ధాని నరేంద్ర మోడీ డ్రీమ్ టీమ్‌లో చోటు సంపాదించారు. 2008వ బ్యాచ్‌కు చెందిన ఉత్తరప్రదేశ్ క్యాడ‌ర్ ఆఫీస‌ర్ రెండేళ్ల క్రితం సంచ‌ల‌నంగా మారారు.

అక్రమార్కులకు హడల్

అక్రమార్కులకు హడల్

నాసీర‌కం రోడ్లు వేసిన కాంట్రాక్ట‌ర్లు, మున్సిప‌ల్ అధికారులపై ఆమె ఓసారి సీరియ‌స్ అయ్యారు. ఆ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో అప్పట్లో వైర‌ల్‌గా మారింది. నిజాయితీ గ‌ల ఆఫీస‌ర్ అంటూ నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

గుర్తించిన మోడీ

గుర్తించిన మోడీ

ఇప్పుడు ఆ అధికారిణికి ప్ర‌ధాని మోడీ అరుదైన గుర్తింపు ఇచ్చారు. ప్ర‌ధాని మోడీ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేపట్టిన స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్‌కు ఐఏఎస్ ఆఫీస‌ర్ చంద్ర‌క‌ళ‌ను డైరెక్ట‌ర్‌గా నియ‌మించారు.

తెలంగాణకు చెందిన వారే..

తెలంగాణకు చెందిన వారే..

మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాట‌ర్ అండ్ శానిటేష‌న్ శాఖ‌లోనూ ఆమెకు ఉప కార్య‌ద‌ర్శి బాధ‌త్య‌ల‌ను అప్ప‌గించారు. బులంద‌ర్‌షెహ‌ర్‌, బిజ్నూర్‌, మీర‌ట్ న‌గ‌రాల్లో క్లీన్ ఇండియా ప్ర‌చారాన్ని ఆమె విజయవంతంగా నిర్వ‌హించారు. కాగా, ఐఏఎస్ చంద్రకళ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
District Magistrate of Meerut, B Chandrakala, has become a part of the dream team of Prime Minister Narendra Modi.
Please Wait while comments are loading...