అద్భుతమైన అనుభవం: లక్షద్వీప్ సముద్రంలో మోడీ స్నోర్కెలింగ్
ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) బుధవారం లక్షద్వీప్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను అస్వాదించడంతోపాటు కాసేపు సముద్ర ఒడ్డున సేద తీరారు. అంతేగాక, సముద్రంలో సాహసోపేతమైన స్నార్కెలింగ్ కూడా చేశారు. సముద్ర గర్భంలోకి వెళ్లి అక్కడి పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించారు ప్రధాని మోడీ. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ తన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో పంచుకున్నారు.
.Recently, I had the opportunity to be among the people of Lakshadweep. I am still in awe of the stunning beauty of its islands and the incredible warmth of its people. I had the opportunity to interact with people in Agatti, Bangaram and Kavaratti. I thank the people of the… pic.twitter.com/tYW5Cvgi8N
— Narendra Modi (@narendramodi) January 4, 2024
'లక్షదీవుల సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి నేనింకా సంభ్రమాశ్చర్యంలోనే ఉన్నా. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంలో ఈ దీవులు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం నేను మరింత కష్టపడి ఎలా పనిచేయాలో ఈ వాతావరణం నాకు నేర్పింది. సాహసాలు చేయాలనుకునేవారు మీ జాబితాలో లక్షద్వీప్ ను కూడా చేర్చుకోండి' అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

లక్షద్వీప్(Lakshadweep)లో తాను స్నార్నెలింగ్ కూడా ప్రయత్నించినట్లు మోడీ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. పగడవపు దీవులు, చేపల ఫొటోలను షేర్ చేశారు. ఇది ఎంతో అద్భుతమైన అనుభవం అని పేర్కొన్నారు ప్రధాని మోడీ.

And those early morning walks along the pristine beaches were also moments of pure bliss. pic.twitter.com/soQEIHBRKj
— Narendra Modi (@narendramodi) January 4, 2024
కాగా, స్నార్నెలింగ్ అనేది సముద్రంలో చేసే ఓ తరహా డైవింగ్ లాంటిది. స్నార్నెల్ అనే ట్యూబ్, డైవింగ్ మాస్క్‌ను ముఖానికి ధరించి సముద్రం లోపల ఈత కొడతారు. ఈ స్నార్కెలింగ్‌తో సముద్ర గర్భంలో పర్యావరణాన్ని జీవరాశులను దగ్గర్నుంచి వీక్షించవచ్చు. ప్రధాని మోడీకి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications