వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశీకి మరింత వెలుగులు తెచ్చే ‘రుద్రాక్ష’ భవనం: వీడియో షేర్ చేసిన ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. వారణాసిలో నిర్మించిన రుద్రాక్ష కనెన్షన్ సెంటర్‌ను గురువారం ప్రధాని మోడీ ప్రారంభించారు. గత ఏడేళ్లుగా వారణాసిని అభివద్ధి చేస్తున్నామని, తాజా నిర్మాణంతో కాశీ పుణ్య క్షేత్రం మరింత వెలుగులీనుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా జపాన్ టెక్నాలజీతో ఈ రుద్రాక్ష భవన నిర్మాణం చేపట్టారు. పర్యాటకులు, వ్యాపారవేత్తలను ఇది ఎంతగానో ఆకర్షిస్తుందని ప్రధాని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా స్టేజీ, సౌండింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశాసినట్లు తెలిపారు.

PM Narendra Modi Shares Aerial View Of ‘Rudraksh’ building in varanasi.

ప్రధాని మోడీ వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారణాసిపై ప్రధాని ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులు చేపట్టారు. వారణాసిలోని పోష్ సిగర ప్రాంతంలో 2.87 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారు.

రెండంతస్తులు భవనంలో 1200 మంది కూర్చునేందుకు వీలుగా తీర్చిదిద్దారు. కాగా, భవన నిర్మాణంలో 108 రుద్రాక్షలను కూడా వినియోగించడం గమనార్హం. అందుకే దీనికి రుద్రాక్ష అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అంతేగాక, మొత్తం భవన నిర్మాణం లింగాకృతిలో ఉండేలా డిజైన్ చేశారు.

ఈ భవన ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఈ నిర్మాణానికి సంబంధించిన ఏరియల్ వ్యూను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మరోవైపు దేశంలోనే తొలిసారి అత్యాధునిక హంగులతో ఆధునీకరించిన గుజరాత్‌లోని గాంధీనగర్ రైల్వేస్టేషన్‌ను ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించనున్నారు.

English summary
PM Narendra Modi Shares Aerial View Of ‘Rudraksh’ building in varanasi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X