వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

66వ పడిలోకి ప్రధాని మోడీ: పాదాభివందనం, తల్లి ఆశీర్వాదం

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: ప్రధాని నరేంద్రమోడీ శనివారం 66వ పడిలోకి అడుగుపెట్టారు. తన పుట్టిన రోజు నేపథ్యంలో శుక్రవారం రాత్రి అహ్మదాబాద్‌ చేరుకున్న ప్రధాని మోడీకి రాష్ట్ర గవర్నర్‌ ఓపీ కోహ్లీ, ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

శనివారం ఉదయం తన తల్లి హీరాబెన్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. తల్లి పాదాలకు నమస్కరించగా, కుమారుడ్ని ఆమె మనసారా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తల్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు మోదీ దాహోద్‌ జిల్లాకు వెళ్లనున్నారు.

PM Narendra Modi takes blessings from mother Hiraba on his 66th birthday

ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తదితరులు ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని ఆయురారోగ్యాలతో ఉండాలని, దేశానికి మరింత సేవ చేయాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ నేరుగా ప్రధాని మోడీని కలసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ తీరంలో మోడీ సైకత శిల్పాన్ని రూపొందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోడీ గుజరాత్‌లోని వాద్ నగర్ లో 1950 సెప్టెంబర్ 17న జన్మించిన సంగతి తెలిసిందే.

English summary
Prime Minister Narendra Modi on Saturday met his mother Hiraba and sought her blessings on his 66th birthday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X