చారిత్రక ఘట్టం, బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ - మోదీ భావోద్వేగం..!!
అయోధ్యలో చారిత్రక ఘట్టం ప్రారంభమైంది. దశాబ్దాల కల నెరువేరుస్తూ బాలరాముడికి అయోధ్య ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేసారు. ముందుగా నిర్ణయించిన అభిజిత్ లగ్నం వేళ ప్రధాని మోదీ ఈ చారిత్రక ఘట్టం లో భాగస్వాములయ్యారు. కార్యక్రమ నిర్వహణ వేళ ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. కోట్లాది మంది కల నెరువేరుస్తున్న వేళ యావత్ దేశం రామ నామంతో హోరెత్తింది. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఈ చారిత్రక ఘట్టానికి ప్రత్యక్షంగా తరలి వచ్చారు.
దేశం మొత్తం అయోధ్య వైపు చూస్తున్న వేళ చారిత్రాత్మక ఘట్టం పూర్తయింది. అయోధ్య అంతా రామ మయంగా మారింది. రామ నామంతో దేశం హోరెత్తుతోంది. అయోధ్యలో అపూర్వ ఘట్టం చూసేందుకు అంతర్జాతీ, జాతీయ ప్రముఖులు అయోధ్యకు తరలి వచ్చారు. అందరూ రామ నామం జపిస్తున్న వేళ ప్రధాని మోదీ ఆలయ ప్రాంగణంకు చేరుకున్నారు.

ముందుగా రామ్ లల్లా విగ్రహాలకు పూజలు చేసారు. ఆ తరువాత మూల విరాట్ వద్ద ప్రధాని మోదీతో పాటుగా ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్, సీఎం యోగీ, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, రామ్ తీర్ద ట్రస్ట్ అధ్యక్షులు గర్భగుడిలో ప్రధాన పూజలో పాల్గొన్నారు. నిర్ణయించిన ముహూర్తాన బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసారు.
#WATCH | The idol of Ram Lalla unveiled at Shri Ram Janmaboomi Temple in Ayodhya in the presence of Prime Minister Narendra Modi. pic.twitter.com/nxYrFD0IpP
— ANI (@ANI) January 22, 2024
ఈ ముహూర్తాన దేశం నలుమూలలా రామ నామం పటిస్తూ భక్తులు ఉద్వేగానికి లోనయ్యారు. బాలరాముడి తొలి దర్శనం వేళ ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. 11 రోజులుగా దీక్షలో ఉన్న ప్రధాని మోదీ రాముడికి తొలి పూజలు చేసారు. ఎక్కడ చూసినా జై శ్రీరాం అని రాసి ఉండడంతో పాటు రామ భజనలు, కీర్తనలతో అయోధ్య మారుమోగుతోంది.

ఆలయాన్ని పూర్తిగా విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. రాత్రిళ్లు బంగారు వర్ణంలో గుడి వెలిగిపోతోంది. బయట గేటు దగ్గర కూడా పూలతో అలంకరించారు. ప్రధాన రహదారి నుంచి గుడికి వెళ్లే దారిలో పది అడుగుల ఎత్తు వరకు పూలతో అలంకరించారు.
#WATCH | PM Narendra Modi unveils the Ram Lalla idol at the Shri Ram Janmaboomi Temple in Ayodhya
— ANI (@ANI) January 22, 2024
#RamMandirAyodhya pic.twitter.com/D4OJ5bPuNw
ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో భాగంగా అయోధ్యలో ఏర్పాటు చేసిన లేజర్ షో అందరిని ఆకట్టుకుంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు, భారీ సంఖ్యలో మోహరించిన భద్రతా బలగాలతో అయోధ్య సందడిగా కనిపిస్తోంది. రఘుపతి రాఘవ రాజారాం పఠిస్తూ భక్తులు పారవశ్యంతో కనిపించారు. కాసేపట్లో ప్రధాని మోదీ అయోధ్య నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయోధ్య పట్టణం మొత్తం రామ మయంగా మారిపోయింది. ఈ చారిత్రక ఘట్టాన్ని కోట్లాది మంది టీవీల ద్వారా వీక్షించారు.












Click it and Unblock the Notifications