వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూల్చిన చోటే విద్యాసాగర్ విగ్రహం ప్రతిష్టిస్తాం : బెంగాల్ మరో ముంబై అవుతుందన్న మోడీ

|
Google Oneindia TeluguNews

మావు : అమిత్ షా ర్యాలీతో చెలరేగిన మాటల యుద్ధం బీజేపీ, టీఎంసీ మధ్య ఇంకా కొనసాగుతుంది. రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల ప్రచారాన్ని ఒకరోజు మందుగానే ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఈ క్రమంలో యూపీలోని మావులో జరిగిన ప్రధాని మోడీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దీదీ, టీఎంసీ వైఖరిపై నిప్పులు చెరిగారు.

టీఎంసీ దౌర్జన్యం

టీఎంసీ దౌర్జన్యం

కోల్ కతాలో అమిత్ షా ర్యాలీలో టీఎంసీ దౌర్జన్యం కళ్లారా చూశామన్నారు ప్రధాని మోడీ. వారే ఆందోళన చేపట్టి .. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చివేశారని ఆరోపించారు. తప్పు చేసి నెపం తమపై నెట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. టీఎంసీ కూల్చిన విద్యాసాగర్ విగ్రహాన్ని అదే చోట తిరగి ప్రతిష్టిస్తామి మోడీ హామీనిచ్చారు.

దీదీ వర్సెస్ మోడీ

దీదీ వర్సెస్ మోడీ

19వ దశాబ్దానికి చెందిన విద్యావేత్త, సామాజికవేత్త విద్యాసాగర్ విగ్రహాం ధ్వంసమవడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఇది బెంగాల్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాలపై చేసిన దాడిగా అభివర్ణించారు. విద్యాసాగర్ అంటే తమకు ఎంతో గౌరవమని .. టీఎంసీ గుండాలే కూల్చివేశారని మోడీ, అమిత్ షా మండిపడ్డారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ .. యూపీ, బీహర్, పూర్వంచల్ ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మోడీ. వారిని ఇతర ప్రాంతాల వారని చెప్పి అవమానిస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి బెహన్ జీ మాయావతి మమతాపై దాడి చేయాల్సింది .. కానీ అలా జరగడం లేదు, కారణమెంటో అందరికీ తెలుసు అని మోదీ అన్నారు.

ప్రచారం నిలిపివేత

ప్రచారం నిలిపివేత

బెంగాల్‌తో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈసీ 36 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేసింది. దీనిపై మమత తీవ్రంగా స్పందించారు. మోదీ, అమిత్ షా చెప్పినట్టు ఎన్నికల సంఘం నడుచుకుంటుందని విమర్శించారు. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం చెలరేగిన అల్లర్ల తర్వాత కంటే బెంగాల్ లో ఘోరమైన పరిస్థితి ఉందా అని మండిపడ్డారు.

English summary
As the Opposition rallied behind Mamata Banerjee over EC ban on campaigning, Prime Minister Narendra Modi hit out at the Bengal CM saying Trinamool indulged in hooliganism during Amit Shah's rally on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X