ఎంపీ సెక్స్ స్కాండల్ కేసులో మొదటిసారి స్పంధించిన మోదీ, చేసింది అంతా మీరే కదా ?
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసుపై ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కర్ణాటకలోని హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఇష్యూను సహించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ చెప్పారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజ్వల్ రేవణ్ణను దేశం విడిచి వెళ్లేలా చేసిందని, ప్రజ్వల్ దేశం విడిచి వెళ్లిపోవడానికి బీజేపీ సహకరించలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
టైమ్స్ నౌకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రకారం ప్రజ్వల్ రేవణ్ణ విషయం శాంతిభద్రతల సమస్య కాబట్టి, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానిదేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని ఇంత వరకు స్పందించలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు పదేపదే ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌తో జేడీఎస్ పొత్తు పెట్టుకున్న నాటి కాలంలోనే ఈ వీడియోలు సేకరించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు పెట్టుకుని వాళ్లు కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పుడు ఆ వీడియోలు సేకరించారని, ఎన్నికల్లో ఒక్కలిగులు ఓట్లు వేసిన తర్వాత వాటిని లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ విడుదల చేపిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం కేవలం ఆరోపణలు చేసినందుకు ప్రజ్వల్ రేవణ్ణను దేశం నుంచి పంపించి తరువాత కాంగ్రెస్ పార్టీ ఆ వీడియోలు విడుదల చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అనుమానాస్పదంగా ఉందని మోదీ ఆరోపించారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల గురించి ముందే సమాచారం ఉంటే విమానాశ్రాయాల్లో నిఘా ఉంచాలని, ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచిపారిపోకుండా ముందుగానే ఆయన్ను పట్టుకుని ఉండాలని ప్రధాని నరేంద్ర మోద అన్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని, కనీసం కేంద్ర ప్రభుత్వానికి ప్రజ్వల్ రేవణ్ణ గురించి సమాచారం కూడా ఇవ్వలేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఆటలు ఆడుతోందని, జేడీఎస్‌తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పుడే కాంగ్రెస్ నేతలు ఈ వీడియోలు సేకరించారని ప్రధాని మోదీ ఆరోపించారు. ఇది తన సమస్య కాదని, ఏ నేరస్తుడి విషయంలో దేశాన్ని విమర్శించకూడదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ విషయంలో తాము సహించేది లేదని, తప్పు చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రజ్వల్ రేవణ్ణను భారత్ తీసుకు వచ్చి చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోది టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వూలో అభిప్రాయం వ్యక్తం చేశారని కన్నడ మీడియా తెలిపింది.












Click it and Unblock the Notifications