వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య తీర్పుపై ప్రధాని మోడీ ప్రసంగం మరికాసెపట్లో

|
Google Oneindia TeluguNews

ఆయోధ్య తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా ఉత్కంఠను నెలకొన్న అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్మాణం వెలువరించిన తర్వాత ఆయన జాతిని ఉద్దేశించి ప్రసగించనున్నారు. కాగా తీర్పు సమయంలో ప్రధాని మోడీ కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. అదే సమయంలో తీర్పుపై స్పందిస్తారని దేశ ప్రజలు ఎదురుచూశారు.

అయితే తీర్పుపై నేరుగా స్పందించని మోడీ ట్విట్టర్‌లో పలు విషయాలు ప్రస్తావించారు. సుప్రీం తీర్పు చట్టం ముందు అందరూ సమానమేనని అనే విషయాన్ని మరోసారి నిరూపించిందని మోడీ అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాతనే సరైన సమయం తీసుకున్న తర్వాతే చరిత్రాత్మక తీర్పు వెలువరించిందని అన్నారు.

PM Narendra Modi will address media soon on Ayodhya

దీంతో న్యాయవ్యవస్థపై మరింత విశ్వాసం పెరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే భారతీయులు సంయమనం పాటించాలని కోరారు. ఈనేపథ్యంలోనే తీర్పును ఏ ఒక్కరి విజయంగానో అపజయంగానో చూడకూడదని పేర్కోన్నారు. రామభక్తులైనా, రహీం భక్తులైనా ఇద్దరు దేశభక్తులేనని అన్నారు.

అయితే సుప్రీం కోర్టు తీర్పులో మసీదుకు 5 ఎకరాలు కేటాయించాలని తీర్పు వెలువరించింది. దానిపై ట్రస్ట్ ఎర్పాటు చేయాలని చెప్పింది. జాతిని ఉద్దేశించి మాట్లాడనున్న మోడీ పలు అంశాలను ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది.

English summary
Prime Minister Narendra Modi will address media soon on Ayodhya after supreme court delivered verdict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X