Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శదర్ పవార్‌ మార్గదర్శకుడు అని ఉద్దవ్ థాకరే పొగడ్తలు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా, ఎందుకంటే

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ 79వ వడిలోకి అడుగిడారు. గురువారం పవార్ జన్మదినం కావడంతో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే, ప్రధాని నరేంద్ర మోడీ కూడా శరద్ పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మహారాష్ట్రలో మహా వికాస్ అగాడీ ప్రభుత్వ ఏర్పాటుకు కారణం శరద్ పవార్ అని ఉద్దవ్ థాకరే అన్నారు. విభిన్న సిద్ధాంతాలతో ఉన్న శివసేన-కాంగ్రెస్ పార్టీలను కలిపింది కూడా అతనేనని పేర్కొన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన యోధుడు అని అభివర్ణించారు. తనకు శరద్ పవార్ మార్గదర్శక గురువు అని ఉద్దవ్ థాకరే పేర్కొన్నారు.

PMs Birthday Wish For Sharad Pawar; Uddhav Thackeray Says Guiding Light

ప్రధాని నరేంద్ర మోడీ కూడా శరద్ పవార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అతను ఆరోగ్యంగా ఉండాలని ట్వీట్ చేశారు. శరద్ పవార్‌ను గురువుగా మోడీ పిలుస్తారు. ఇటీవల రాజ్యసభలో ఎన్సీపీ ఎంపీలను మోడీ పొగిడిన సంగతి తెలిసిందే. మరోవైపు మోడీ తనతో కలిసి పనిచేద్దామని కోరారని.. అయితే సిద్ధాంతపరంగా విభేదాలు ఉండటంతో పనిచేయలేదని శరద్ పవార్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

శదర్ పవార్ కూతురు సుప్రియ సూలే కూడా తన తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ శక్తికి కారణం మీరే, దానిని మీరు మరింత శక్తివంతం చేశారని పేర్కొన్నారు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+