లాక్ డౌన్ పాటించని రాష్ట్రాలపై ప్రధాని అసహనం ... పెరిగిన ధరలతో బతుకు భారం
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించాయి ప్రభుత్వాలు . మార్చి 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ షట్ డౌన్ చేస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రభావం ఏవిధంగా ఉంది. ప్రజా జీవనం మీద ఏ విధమైన ప్రభావం పడుతుంది? ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారా ? లేక రోడ్లమీద తిరుగుతున్నారా ? నిత్యావసర వస్తువుల ధరలు పెంచవద్దని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినా నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్న పరిస్థితి దేశంలో ముందు ముందు ఎటువంటి సమస్యలకు కారణమవుతుంది ? అనేది ఇప్పుడు టెన్షన్ పెడుతుంది.

మార్చి 31వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా షట్ డౌన్
భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా ను కంట్రోల్ చేయడం కోసం ఆదివారం నాడు జనతా కర్ఫ్యూ పాటించాలని సూచించారు. ప్రజలందరూ ప్రధాని నరేంద్ర మోడి విజ్ఞప్తి మేరకు జనతా కర్ఫ్యూను సక్సెస్ చేశారు. అయితే నేడు కరోనా కేసుల సంఖ్య 433 కి చేరింది. కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 31వ తేదీ వరకు షట్ డౌన్ చేయాలని అటు కేంద్రం, రెండు రాష్ట్రాలు భావించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది.

నేడు రోడ్లపై జనాలు .. నిత్యావసరాల కోసం ఎగబడుతున్న వైనం
నిన్న ఒక్కరోజు జనతా కర్ఫ్యూ కు సహకరించిన ప్రజలు నేను రోడ్డు మీదకు వచ్చారు. ఎక్కడ కూడా ప్రజలు ఇళ్లకు పరిమితమైన పరిస్థితి కనిపించడం లేదు. ఇక నిత్య అవసరాల కోసం దుకాణాల వద్ద ఎగబడుతున్నారు. సందట్లో సడేమియా అంటూ నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెంచేశారు. ఎర్రగడ్డ మార్కెట్ లో నిన్నటి వరకు పది రూపాయలు ఉన్న టమాట ధరలు నేడు 30 రూపాయలకు చేరాయి. ఇక ఇదే సమయంలో నిత్యావసరాలను డబల్ రేట్లకు విక్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

కొండెక్కి కూర్చున్న నిత్యావసరాలు
ఒక పక్క ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలను బ్లాక్ చేసిన, లేదా అదనపు ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నాయి. అయినప్పటికీ నిత్యావసర వస్తువుల ధరలు వస్తున్న పరిస్థితి సామాన్యులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మొత్తానికి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు పనులు లేక ప్రజలు ఇబ్బంది పడడం, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం వంటి పరిణామాలు ముందు ముందు ఎలాంటి పరిస్థితులకు కారణం అవుతాయి అన్న ఆందోళన వ్యక్తమౌతుంది.

31వరకు లాక్ డౌన్ అమలు కష్టంగా మారిన వైనం
ఒకపక్క ప్రభుత్వాలు సామాన్యులకు రేషన్ అందిస్తామని, ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెబుతున్నప్పటికీ, ధరాఘాతం శరాఘాతంగా మారడంతో సామాన్యుడి బతుకు భారం కానుంది. మరోపక్క కరోనా వైరస్ బారిన పడిన కేసుల సంఖ్య కూడా దేశంలో పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. ప్రజలు ఒక రోజు రెండు రోజుల వరకు ఇళ్ల కే పరిమితం కావాలని చెప్తే ఉంటారేమో కానీ ఇన్నిరోజుల లాక్ డౌన్ పాటించడం ప్రజలకు సాధ్యం కాని పరిస్థితి అని అర్థమౌతుంది.

లాక్ డౌన్ నిబంధనల అమలు తీరుపై ప్రధాని అసహనం
ఇప్పటికే రోడ్డెక్కిన జనాలు తమ పనుల్లో నిమగ్నమై తే, ఇక ప్రజలను కంట్రోల్ చేయడం ప్రభుత్వాలకు పెద్ద టాస్క్ గా మారనుంది. ఇక నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కరోనా వైరస్ విలయ తాండవం చేయకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకు ప్రజల సహకారం కూడా అందించాల్సిన అవసరం ఉంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ కూడా లాక్ డౌన్ ప్రకటించినా అమలు చెయ్యని ప్రభుత్వాల తీర్పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా అమలు చెయ్యాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications