ప్రధాని ప్రసంగం: సీఎం సిద్దూ గాఢ నిద్ర

మైసూరు: సాంసృతిక నగరం మైసూరులో జరిగిన ది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 103వ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశం గురించి, మన శాస్త్రవేత్తల ప్రతిభ గురించి మాట్లాడుతున్న సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గాఢ నిద్రలోకి జారుకున్నారు.

వేలాది మంది శాస్ర్తవేత్తలు పాల్గోన్న ఈ సమావేశంలో సిద్దరామయ్య నిద్రపోవడంతో సొంత పార్టీ నాయకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మైసూరు నగరంలో ది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 103వ సమావేశం జరిగింది.

వివిద దేశాలకు చెందిన నోబెల్ గ్రహీతలు, పరిశోధకులు, వేలాది మంది శాస్ర్తవేత్తలు పాల్గోన్నారు. ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో సిద్దరామయ్య చల్లగా, హాయిగా నిద్రలోకి జారుకున్నారు. నోబెల్ గ్రహీతలు వారి పరిశోధనలు గురించి వివరిస్తా ఉంటే తనపని తనదంటూ సిద్దరామయ్య నిద్రపోయారు.

PM was speaking at the venue, Siddaramaiah was seen sleeping on his chair.

గతంలో మాజీ ప్రధాని దేవేగౌడ శిష్యుడు అయిన సిద్దరామయ్య తన పాత గురువు లక్షణాలు కొన్ని వెంట తెచ్చుకున్నారు. వేదికల మీద నిద్రపోవడం సిద్దరామయ్యకు కొత్తకాదు. అయితే ఇలాంటి ముఖ్యమైన సమావేశంలో ఆయన నిద్రపోవడంతో పలువురు విమర్శలు చేస్తున్నారు.

గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనూ ఆయన నిద్రపోయిన సందర్బాలు చాలనే ఉన్నాయి. రాష్ట్రపతి పర్యటన సందర్బంగా జరిగిన సమావేశంలో సిద్దరామయ్య నిద్రపోయారు. పలు సమావేశాలలో మాజీ ప్రధాని దేవేగౌడ నిద్రపోయి, సమావేశం పూర్తి అయిన తరువాత నిద్రలేచిన విషయం అందరికి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+