మోదీ నయా రికార్డు.. ట్రంప్ ను దాటి.. ప్రపంచంలో తొలి నేతగా..
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ పేరు మీద అనేక రికార్డులు ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా డిజిటల్ గానూ ఆయన కొత్త మైలురాయిని అధిగమించారు. ఇన్ స్టా గ్రామ్ లో మోదీ ఫాలోవర్స్ 100 మిలియన్ లు దాటారు. దాంతో ఇన్ స్టాలో 10 కోట్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించిన తొలి ప్రపంచ నేతగా ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు నెలకొల్పారు. ఇక ప్రస్తుతం ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్ల సంఖ్య ప్రస్తుతం 100 మిలియన్లు దాటారు. అంటే 10 కోట్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించారు. ప్రపంచంలో ఏ దేశ నాయకుడికీ లేని విధంగా మోదీ డిజిటల్ మీడియాలో ఫాలోవర్స్ ను పొందారు. దాంతో ప్రపంచంలోనే తొలి నేతగా మోదీ రికార్డు నెలకొల్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను సైతం వెనక్కు నెట్టి ఈ అరుదైన ఘనతను సాధించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ నిలిచారు. అటు ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఇజ్రాయెల్ పార్లమెంటులో కీలక ప్రసంగం చేసి చరిత్ర సృష్టించారు.
ఇక సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు 4.32 కోట్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు 1.5 కోట్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. ఇక నాలుగో స్థానంలో బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా ఉన్నారు. ఆయనకు సోషల్ మీడియాలో 1.44 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రధాని మోదీ ఇన్ స్టా గ్రామ్ లో చేరారు. ఎప్పటికప్పుడు తన అధికారిక కార్యక్రమాలు, పర్యటనలు, ప్రసంగాలు, పోస్టులు, వివిధ కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ ఘనతను సాధించగలిగారు.

ఇక భారత్ లోనూ ప్రధాని నరేంద్ర మోదీ.. సోషల్ మీడియా ఫాలోవర్స్ లో అందరికంటే చాలా ముందున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం 1.61 కోట్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 1.26 కోట్ల ఫాలోవర్స్ తో మూడో స్థానంలో నిలిచారు. ఇక తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత పురస్కారమైన "స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్" లభించింది. భారత్- ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో, వ్యక్తిగత నాయకత్వం ద్వారా రక్షణ, భద్రత, సాంకేతికత, దౌత్య సహకారం వంటి రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించిన ఆయన కృషికి గుర్తింపుగా దీనిని జెరూసలెంలోని పార్లమెంటులో అందజేశారు. ఈ గౌరవం పొందిన తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications