యుద్ధం వేళ మోదీ చాణక్యం.. కర్ర విరక్కుండా.. పాము చావకుండా..!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే. అయితే చమురు కొరతతో ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా పలు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అయితే దేశంలో ఇంధన సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అన్న ధోరణిని ఆవలంభిస్తోంది.

ఓవైపు యుద్ధం వద్దు.. చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ అటు ఇరాన్, ఇరు ఇజ్రాయెల్, అమెరికాకు సూచనలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇరాన్ నుంచి ఎలా ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. దాంతో ఇరన్.. హార్మూజ్ జలసంధి నుంచి భారత్ నౌకలను పంపిస్తోంది. తాజాగా మరో 2 LPG షిప్‌ లూ హార్మూజ్ జలసంధిని దాటాయి. అటు గల్ఫ్ దేశాలతోనూ స్నేహం కొనసాగిస్తోంది భారత్.

మరోవైపు ఇవాళ సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్‌ తో ప్రధాని మోదీ ఫోన్‌ లో మాట్లాడారు. సురక్షిత నౌకాయానానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తుందని పునరుద్ఘాటించారు. అలాగే నౌకాయాన స్వేచ్ఛను, షిప్పింగ్ మార్గాలను సురక్షితంగా, నిరంతరం అందుబాటులో ఉంచాల్సిన ఆవశ్యకతపై ఇరువురు అంగీకరించినట్లు తెలిపారు. సౌదీ అరేబియాలోని భారత సమాజ సంక్షేమానికి సౌదీ యువరాజు నిరంతర మద్దతుకు ధన్యవాదాలు తెలియజేశాను.. అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రధాని మోదీ, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మధ్య జరిగిన రెండో టెలిఫోనిక్ సంభాషణ ఇది. ఈ సంక్షోభంలో భాగంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌ పై దాడులు చేయగా.. ఇరాన్ తిరిగి ఇజ్రాయెల్, ఇతర ప్రాంతీయ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. మరోవైపు ప్రపంచ ఇంధన సరఫరాలో దాదాపు 20 శాతం రవాణా జరిగే కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ వ్యూహాత్మక నియంత్రణ ఉండటం ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలను పెంచుతోంది.

PMModi Urges Saudi Crown Prince for Safe Navigation After Indian Tankers Cross Hormuz PM Modi Saudi

ఇక ఇరాన్.. మిత్ర దేశాలుగా పేర్కొన్న జాబితాలో భారత్ కు అనుమతి లభించిన తర్వాత, రెండు ఎల్‌ పీజీ ట్యాంకర్లు హార్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటాయి. ఈ పరిణామం భారత్ ఇంధన అవసరాల భద్రతకు పెద్ద ఊరట నిచ్చింది. ఎందుకంటే భారత్ తన ఇంధన అవసరాలలో 90శాతం దిగుమతులపై ఆధారపడుతుంది. తాజాగా BW ELM, BW TYR అనే ఈ రెండు ఎల్‌ పీజీ ట్యాంకర్లు హార్మూజ్ జలసంధి గుండా వెళ్లాయి. ఇక పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి.. జగ వసంత్, పైన్ గ్యాస్, శివాలిక్, నందా దేవి అనే నాలుగు భారత్ నౌకలు ఈ జలసంధిని దాటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+