వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిఎన్బీ‌స్కాం: అలహబాద్‌ బ్యాంక్ ఎండి ఉషా అనంత సుబ్రమణియన్‌ను ప్రశ్నించనున్న సిబిఐ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ నేపథ్యంలో అలహబాద్ బ్యాంక్ సిఈఓ, ఎండి ఉషా అనంతసుబ్రమణియన్‌ను సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.అనంతసుబ్రమణియన్ ఇటీవల కాలంలోనే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్స్‌కు చీఫ్‌గా ఎన్నికయ్యారు. 2015 ఆగష్టు 14 నుండి అనంత సుబ్రమణియన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈఓ, ఎండిగా 2017 మే 6వ, తేది వరకు కొనసాగారు.

2017 మే 6వ, తేదిన అనంత సుబ్రమణియన్ అలహబాద్ బ్యాంక్ ఎండిగా, సిఈఓగా కొనసాగుతున్నారు అంతకుముందు.జూలై 2011 నుండి నవంబర్ 2013 వరకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడ ఆమె పనిచేశారు.

Recommended Video

PNB fraud : 3 More Arrested, Centre Says RBI Failure

సుదీర్ఘకాలం పాటు బ్యాంకులో పనిచేసిన అనంత సుబ్రమణియన్‌ను సిబిఐ అధికారులు కొన్ని సందేహలను నివృత్తి చేసుకొంటున్నారు. భారీ మొత్తంలో నగదు లావాదేవీల విషయంలో బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియకుండా ఎలా జరిగిందనే విషయమై సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నారు.

PNB fraud: CBI questions Allahabad Bank CEO & MD Usha Ananthasubramanian

ఈ కేసు విషయమై పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఐదుగురు ఆడిటర్లను కూడ సిబిఐ ప్రశ్నించనుంది. ఆడిటర్లు పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటు చేసుకొన్న అవకతవకలపై ఆడిటర్లు గుర్తించినప్పటికీ బ్యాంక్ సీనియర్ అధికారులు వాటిని పట్టించుకోలేదనే అనుమానాన్ని సిబిఐ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకును నీరవ్ మోడీ మోసం చేసిన సొమ్మును సుమారు 13 వేల కోట్లకు చేరిందని అధికారులు తాజాగా లెక్క కట్టారు.
గతంలో ఇది 11వేల కోట్లు మాత్రమే.

మరో వైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంతర్జాతీయ ఖాతాలను పర్యవేక్షిస్తున్న ఇద్దరు సిట్టింగ్ మేనేజర్లు నీహల్ అహద్, విమ్లేస్ కుమార్‌లకు ఈ వ్యవహరంలో పాత్ర ఉందని నిఘా అధికారులు గుర్తించారు.

English summary
The PNB, in a late night filing to stock exchanges, said the scam has swelled by USD 204.25 million. The quantum of alleged fraud perpetrated in the bank by billionaire jewellers Modi and Choksi now stands at close to USD 2 billion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X