కృష్ణుడి సందేశం అందించేందుకే: అన్వర్, ఉర్దూలోకి గీత
లక్నో: ప్రముఖ ఉర్దూ కవి, రచయిత అన్వర్ జలాల్‌పురి భగవద్గీతను ఉర్దూలోకి అనువదించారు. భగవద్గీతలోని ఏడు వందల ఒక్క శ్లోకాలను ఉర్దూలో రెండేసి లైన్లు ఉండే 1701 దోహాలుగా ఆయన అనువదించరు. ప్రాపంచిక జ్ఞానానికి సంబంధించి శ్రీకృష్ణుడు ఇచ్చిన సందేశాన్ని యథాతథంగా అందించడమే ధ్యేయంగా ఈ అనువాదం చేసినట్లు అన్వర్ చెప్పారు.
ఈ ఉర్దూ భగవగ్దీతను 'ఉర్దూ శాయరీ మే గీత' అంటున్నారు. ఈ గ్రంథాన్ని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొద్ది రోజుల క్రితం ఆవిష్కరించారు.

భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పాండువులలో మధ్యముడు అయిన అర్జునుడికి బోధిస్తాడు. ధర్మం నిర్వర్తించాలంటాడు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం సమయంలో అర్జునుడు తమ ఎదురుగా ఉన్న కౌరవ సైన్యాన్ని చూసి అందరు తమ వారేనని, తాను యుద్ధం చేయనని చెబుతాడు. దీంతో శ్రీకృష్ణుడు అతనికి గీతను బోధిస్తాడు. కర్తవ్యాన్ని చెబుతాడు.












Click it and Unblock the Notifications