ముస్లిం హెడ్‌మాస్టర్‌ను తొలగించేందుకు పాఠశాల నీటి ట్యాంక్‌లో విషం

కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని ముస్లిం ప్రధానోపాధ్యాయుడిని తొలగించేందుకు కొందరు దారుణమైన పని చేశారు. పాఠశాల వాటర్ ట్యాంక్‌లో విషం కలిపారు. జులై 14న జరిగిన ఈ ఘటనలో శ్రీరామ సేన నాయకుడు సహా మరో ఇద్దరిని కర్ణాటక పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. జులై 14న కలుషిత నీరు తాగి పదకొండు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

ఘటన వివరాలు ఇలా..
ఈ ముగ్గురు నిందితులు బెళగావి జిల్లాలోని హులికట్టి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని తాగునీటి ట్యాంక్‌లో క్రిమిసంహారక మందులు కలిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘోరమైన కుట్ర వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.. ముస్లిం మతానికి చెందిన పాఠశాల హెడ్‌మాస్టర్‌ను తొలగించడమే అని పోలీసులు వెల్లడించారు. ఇది మత విద్వేషంతో కూడిన నేరంగా భావిస్తున్నారు.అరెస్టయిన నిందితులను శ్రీరామ సేన సవదత్తి తాలూకా యూనిట్ అధ్యక్షుడు సాగర్ పాటిల్, కృష్ణ మదర్, మగన్‌గౌడ పాటిల్‌గా పోలీసులు గుర్తించారు.

Poison in School Water Tank to Remove Muslim Headmaster Sri Rama Sene Leader Arrested

కుట్ర వెనుక కారణం.. పోలీసుల విచారణ
బెళగావి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) భీమశంకర్ ఎస్ గులెడ్ శనివారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. "కొంతమంది విద్యార్థులు (నీటిలో) దుర్వాసనను గుర్తించి హెడ్‌మాస్టర్‌కు, మరో ఉపాధ్యాయుడికి తెలియజేయడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. నీరు తాగిన కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారికి వెంటనే వైద్య చికిత్స అందించగా.. కోలుకున్నారని వెల్లడించారు. ఈ ముందుస్తు సమాచారం వల్ల ప్రాణ నష్టం తప్పిందని పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కుట్రకు సాగర్ పాటిల్ ప్రధాన సూత్రధారి. "అతను (సాగర్ పాటిల్) హెడ్‌మాస్టర్ సులేమాన్ గోరనాయక్‌ను బదిలీ చేయించాలనుకున్నాడు లేదా సస్పెండ్ చేయాలనుకున్నాడు. గోరనాయక్ 13 సంవత్సరాలుగా పాఠశాలలో నిబద్ధతతో పనిచేస్తున్నారు. గ్రామస్తులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నీటి ట్యాంక్ దగ్గర ఒక సాఫ్ట్ డ్రింక్ బాటిల్ కనిపించింది, దానిని పరిశీలించగా, అందులో క్రిమిసంహారక మందు ఉన్నట్లు తేలింది" అని అధికారి వివరించారు.

విచారణ సందర్భంగా నిందితులలో ఒకరైన కృష్ణ మదర్ సంచలన విషయాలను అంగీకరించాడు. సాగర్ పాటిల్ చెప్పినట్లుగానే తాను ఒక మైనర్ అబ్బాయికి చాక్లెట్లు, ఇతర తినుబండారాలు, రూ.500 ఇచ్చి, పాఠశాల నీటి ట్యాంక్‌లో క్రిమిసంహారక మందు ఉన్న బాటిల్‌ను కలిపించానని అంగీకరించాడు. మదర్ వేరే కులానికి చెందిన మహిళతో సంబంధం పెట్టుకున్నాడని సాగర్ పాటిల్ కనుగొని, ఆ సంబంధాన్ని బయటపెడతానని బెదిరించడంతోనే తాను ఈ కుట్రలో భాగమయ్యానని మదర్ తెలిపాడు. మదర్, మగన్‌గౌడ పాటిల్ కలిసి క్రిమిసంహారక మందును కొనుగోలు చేసినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

న్యాయపరమైన చర్యలు, మత విద్వేషంపై ఎస్పీ వ్యాఖ్యలు
పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఈ కేసులో కీలకంగా మారిన మైనర్ బాలుడు ప్రాసిక్యూషన్ సాక్షిగా ఉంటాడని, చట్టం నుండి అతనికి తగిన రక్షణ కల్పిస్తామని చెప్పారు."ఈ కేసును పరిష్కరించడానికి మేము శాస్త్రీయ ఆధారాలను, విద్యార్థుల వాంగ్మూలాలను ఉపయోగించాము. ఇది మత విద్వేషంతో ప్రేరేపించబడిన, ప్రణాళికాబద్ధమైన, తీవ్రమైన, కలవరపరిచే ప్రయత్నం" అని ఎస్పీ గులెడ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటన సమాజంలో మత విద్వేషం ఏ స్థాయికి దిగజారుతుందో స్పష్టం చేస్తుందని పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+