లవ్ మ్యారేజ్, నెల రోజులకే అల్లుడు హత్య, కూతురు హత్యకు ఆంటీ స్కెచ్ !

చెన్నై/క్రిష్ణగిరి: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవడానికి వీలులేదని తేల్చి చెప్పారు. తల్లిదండ్రులను ఎదిరించిన ప్రియురాలు ఆమె ప్రియుడిని పెళ్లి చేసుకుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రియుడిని నెల రోజుల్లోనే ప్రియురాలి కుటుంబ సభ్యులు చంపేశారు. ఇప్పుడు కూతుర్ని కూడా ఆమె కుటుంబ సభ్యులు హత్య చెయ్యడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

హత్య కేసులో తన కుమార్తెను కోర్టుకు హాజరుకాకుండా చెయ్యడానికి ఆమెను చంపేస్తామని బెదిరించిన తల్లితో సహా ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని కృష్ణగిరి సమీపంలోని కిట్టంపట్టికి చెందిన జగన్ ( 28) అనే యువకుడు టైలర్‌గా పనిచేసేవాడు. ఇతను కృష్ణగిరి జిల్లా అవధానపట్టి సమీపంలోని తులికాన్ కొట్టాయ్‌కు చెందిన శంకర్‌ కుమార్తె శరణ్య (22)ను ప్రేమించాడు. శరణ్య కూడా జగన్ ను ప్రేమించింది.

 Police

ప్రేమికులు హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. జగన్ గురించి శరణ్య ఇంట్లో తెలిసిపోయింది. తక్కువ కులం వాడు, అది టైలర్ పని చేస్తున్న జగన్ ను పెళ్లి చేసుకోవడానికి వీలులేదని శరణ్యకు ఆమె కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. కుటుంబ సభ్యులను ఎదిరించిన శరణ్య ఇదే ఏడాది ఫిబ్రవరిలో తల్లిదండ్రుల వ్యతిరేకతను కూడా పట్టించుకోకుండా ప్రేమించిన జగన్ ను గుడిలో పెళ్లి చేసుకుంది.

లవ్ మ్యారేజ్ చేసుకున్న ప్రేమికులు హ్యాపీగా కాపురం చేశారు. ఈ పరిస్థితిలో ఇదే ఏడాది మార్చి 21వ తేదీన క్రిష్ణగిరి సమీపంలోని డ్యామ్ రోడ్డులో జగన్ బైక్ లో వెలుతుంటే శరణ్య తండ్రి శంకర్ సహా ముగ్గురు వ్యక్తులు మార్గం మధ్యంలో అతన్ని అడ్డగించారు. తరువాత శరణ్య భర్త జగన్ ను అతికిరాతకంగా నరికి చంపారు. ఈ హత్య కేసులో శరణ్య తండ్రి శంకర్, వారి బంధువులు మురళి, నాగరాజ్ అనే ముగ్గురు వ్యక్తులు కోర్టులో లొంగిపోవడంతో జైలులో ఉన్నారు.

 Police

శరణ్య ప్రస్తుతం కిట్టంబట్టి సమీపంలోని వథియార్ కోటై గ్రామంలోని ఆమె భర్త జగన్ ఇంట్లో నివసిస్తోంది. ఈ స్థితిలో 26వ తేదీ సాయంత్రం శరణ్య ఇంట్లో ఉన్న సమయంలో ఆమె తల్లి రత్నమ్మ (40)తో పాటు మరికొందరు అక్కడికి వెళ్లారు. ఈ కేసు విచారణకు నువ్వు కోర్టుకు హాజరు కావద్దని, నువ్వు కోర్టుకు హాజరు అయితే నా భర్త శంకర్ కు బెయిల్ రాదని శరణ్యను ఆమె తల్లి రత్నమ్మ తదితరులు బెదిరించారు.

అయితే తాను కచ్చితంగా కోర్టుకు హాజరు అవుతానని, పెళ్లి చేసుకున్న నెల రోజులకే తన భర్త జగన్ ను చంపిన వారికి వ్యతిరేకంగా కోర్టులో సాక్షం చెబుతానని శరణ్య ఆమె తల్లికి తేల్చి చెప్పింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన రత్నమ్మ, ఆమె బంధువులు శరణ్య మీద దాడి చేసి ఆమెను అసభ్య పదజాలంతో దూషించారు.

 Police

నువ్వు కోర్టుకు హాజరు అయితే నిన్ను కూడా చంపేస్తామని శరణ్యను ఆమె తల్లి రత్నమ్మ బెదిరించారు. ఈ విషయమై శరణ్య క్రిష్ణగిరి సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపారు. విచారణలో శరణ్యకు ప్రాణహాని ఉందని నిర్ధారించిన పోలీసులు, సుండేగుప్పం సమీపంలోని భిఖా కొట్టాయ్‌కి చెందిన శరణ్య తల్లి రత్నమ్మ, ఆమె మేన కోడలు భూమణి అనే ఇద్దరిని అరెస్టు చేశారు.

భైక్కోట్టై ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తుల కోసం క్రిష్ణగిరి పోలీసులు వెతుకుతున్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరు మహిళలపై వ్యక్తులపై పోలీసులు అసభ్యకరంగా మాట్లాడటం, దాడి చేయడం, చంపేస్తామని బెదిరించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయమై శరణ్య క్రిష్ణగిరి సిటీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+