Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలీసుల చేతుల్లోకి ఆశ్రమం..'ఆపరేషన్ అరెస్ట్'(ఫోటోలు)

న్యూఢిల్లీ: హర్యానాలోని హిస్సార్ జిల్లా బర్వాలాలోని స్వామిజీ రాంపాల్ సత్‌లోక్ ఆశ్రమం హర్యానా పోలీసులు అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. వివాదాస్పద స్వామిజీని అరెస్టు చేసేందుకు ఆ రాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్ రెండవ రోజుకి చేరుకుంది. అర్ధరాత్రి జరిపిన ఆపరేషన్‌లో సత్‌లోక్ ఆశ్రమం పూర్తిగా ఖాళీ అయినట్లు సమాచారం. ఆశ్రమంలోని పిల్లలు, మహిళలను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కొంత మంది స్వామీజీ అనుచరులు ఉన్నట్లు వారిని కూడా అదుపులోకి తీసుకోనున్నట్లు వెల్లడించారు.

బాబా రాంపాల్ ఆశ్రమం నుంచి నేటి ఉదయం సుమారు 10 వేల మంది బయటకు వచ్చారని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా చాలా మంది ఆశ్రమం లోపల ఉన్నారని, వారిని బలవంతంగా రాంపాల్ అనుచరులు నిర్బంధించారని తెలిపారు. కాగా, రాంపాల్ ప్రైవేట్ ఆర్మీకి లొంగిపోయేందుకు ఉదయం 10 గంటల వరకు సమయమిచ్చిన హర్యానా పోలీసులు మరోసారి 'ఆపరేషన్ అరెస్ట్'ను ప్రారంభించారు.

హర్యానా పోలీసులు, పారా మిలటరీ బలగాలు మంగళవారం భారీ ఎత్తున స్వామీజీ ఆశ్రమంకు చేరుకుని.. ఆశ్రమం లోపలికి వెళ్లి స్వామీజీని అరెస్టు చేసేందుకు చేసిన ప్రయత్నాలను రాంపాల్ అనుచరులు అడ్డుకున్న విషయం తెలిసిందే. హర్యానా డీజీపీ ఎస్ఎన్ వశిష్ట్ విలేకరులతో మాట్లాడుతూ బాబా రాంపాల్ ఇప్పటికీ ఆశ్రమంలో ఉన్నారనీ.. ఇది వంద శాతం వాస్తవమని చెప్తున్నారు. స్వామీజీ ఆనుచరులు, ప్రైవేటు సైన్యం పోలీసులపై కాల్పులు జరిపారని.. యాసిడ్ సీసాలు, పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడి చేశారని అన్నారు.

వారి వద్ద పిస్టళ్లు, రివాల్వర్లు, ఇతర మారణాయుధాలున్నాయని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో చాలా మంది పోలీసులకు గాయలయ్యాయన్నారు. ఒక ఏఎస్ఐ మెడలోకి బుల్లెట్ దూసుకుపోయిందని వివరించారు. పోలీసులు కూడా టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ క్యాన్లతో స్వామీజీ అనుచరులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.

స్వామీజీ ఆశ్రమంలో భారీగా ఎల్‌పీజీ సిలండర్లు కూడా ఉన్నందున మరింత జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నామన్నారు. సత్‌లోక్ ఆశ్రమంలో ఉన్న స్వామీజీని అదుపులోకి తీసుకునేంత వరకు తమ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు. విలేకరులతో పోలీసులు దాడి చేస్తూ వచ్చిన దృశ్యాలు టీవీల్లో ప్రసారం కావడంతో, ఆ విషయంపై విచారణ జరుపుతామన్నారు.

 బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద రెండవ రోజు

బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద రెండవ రోజు

హర్యానా పోలీసులు, పారా మిలటరీ బలగాలు మంగళవారం భారీ ఎత్తున స్వామీజీ ఆశ్రమంకు చేరుకుని.. ఆశ్రమం లోపలికి వెళ్లి స్వామీజీని అరెస్టు చేసేందుకు చేసిన ప్రయత్నాలను రాంపాల్ అనుచరులు అడ్డుకున్న విషయం తెలిసిందే.

 బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద రెండవ రోజు

బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద రెండవ రోజు

హర్యానా డీజీపీ ఎస్ఎన్ వశిష్ట్ విలేకరులతో మాట్లాడుతూ బాబా రాంపాల్ ఇప్పటికీ ఆశ్రమంలో ఉన్నారనీ.. ఇది వంద శాతం వాస్తవమని చెప్తున్నారు. స్వామీజీ ఆనుచరులు, ప్రైవేటు సైన్యం పోలీసులపై కాల్పులు జరిపారని.. యాసిడ్ సీసాలు, పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడి చేశారని అన్నారు.

 బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద రెండవ రోజు

బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద రెండవ రోజు

వారి వద్ద పిస్టళ్లు, రివాల్వర్లు, ఇతర మారణాయుధాలున్నాయని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో చాలా మంది పోలీసులకు గాయలయ్యాయన్నారు.

 బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద రెండవ రోజు

బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద రెండవ రోజు

ఒక ఏఎస్ఐ మెడలోకి బుల్లెట్ దూసుకుపోయిందని వివరించారు. పోలీసులు కూడా టియర్ గ్యాస్ షెల్స్, వాటర్ క్యాన్లతో స్వామీజీ అనుచరులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.

 బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద రెండవ రోజు

బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద రెండవ రోజు

12 ఎకరాల్లో నాలుగు వైపులా 50 అడుగుల ఎత్తైన దుర్బేద్యంగా నిర్మించుకున్న ఆశ్రమం లోపల దాదాపు 3 వేల మంది రాంపాల్ అనుచరులు ఉన్నారు. ఆశ్రమ గోడను పగులగొట్టేందుకు పోలీసులు తీసుకువచ్చిన ఒక జేసీబీ వాహనాన్ని స్వామీజీ అనుచరులు తగులబెట్టారు.

 బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద రెండవ రోజు

బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద రెండవ రోజు

స్వామీజీ ఆశ్రమంలో భారీగా ఎల్‌పీజీ సిలండర్లు కూడా ఉన్నందున మరింత జాగ్రత్తగా ముందడుగు వేస్తున్నామన్నారు. సత్‌లోక్ ఆశ్రమంలో ఉన్న స్వామీజీని అదుపులోకి తీసుకునేంత వరకు తమ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు.

బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద రెండవ రోజు

బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద రెండవ రోజు

ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్న రాంపాల్ స్వామీజీపై హర్యానా-పంజాబ్ ఉమ్మడి హైకోర్టు కంటెమ్ట్ ఆప్ కోర్టు కింద అరెస్టు వారెంట్ జారీ చేసింది. శుక్రవారంలోగా ఆయనను కోర్టుకు హాజరుపర్చాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

 బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద రెండవ రోజు

బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద రెండవ రోజు

దాంతో పోలీసులు, పారా మిలటరీ బలగాలు మంగళవారం స్వామీజీ ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. ఆశ్రమం లోపలికి వెళ్లి స్వామీజీని అరెస్టు చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను రాంపాల్ అనుచరులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.

 బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద రెండవ రోజు

బాబా రాంపాల్ ఆశ్రమం వద్ద రెండవ రోజు

రాంపాల్ అనుచరులు చట్టానికి కట్టుబడి ఉండాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. బలగాలను తొలగించాలంటూ రాంపాల్ అనుచరలు జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఆశ్రమం వద్ద మీడియా ప్రతినిధులపై పోలీసుల దాడిని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ), ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలు తీవ్రంగా ఖండించాయి.

ఆశ్రమ ప్రతినిధి రాజ్ కపూర్ మాత్రం స్వామీజీ అనారోగ్యంతో ఉన్నారని, ఒక రహస్య ప్రదేశంలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. చట్టం నుంచి పారిపోయేందుకు స్వామీజీ ప్రయత్నించడం లేదని, ఆరోగ్యం కోలుకోగానే కోర్టులో హాజరవుతారన్నారు. పోలీసుల దాడిలో ఆశ్రమంలోని నలుగురు మహిళలు మరణించారని ఆరోపించారు.

మరోవైపు ఆశ్రమంలో ఉన్న ప్రజలను స్వామీజీ అనుచరులు.. ఆయన ప్రైవేట్ సైన్యం బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుంటోందని, మంగళవారం ఉదయం ఆశ్రమం నుంచి తప్పించుకుని బయటకు వచ్చిన పలువురు వెల్లడించారు.
సత్‌లోక్ ఆశ్రమం వద్ద పోలీసులు.. స్వామీజీ అనుచరులు మధ్య నిన్న జరిగిన ఘర్షణల్లో 200 మంది గాయపడగా.. వారిలో స్వామీజీ అనుచరులతో పాటు, మీడియా ప్రతినిధులతో పాటు 100కు పైగా పోలీసులున్నారు.

12 ఎకరాల్లో నాలుగు వైపులా 50 అడుగుల ఎత్తైన దుర్బేద్యంగా నిర్మించుకున్న ఆశ్రమం లోపల దాదాపు 3 వేల మంది రాంపాల్ అనుచరులు ఉన్నారు. ఆశ్రమ గోడను పగులగొట్టేందుకు పోలీసులు తీసుకువచ్చిన ఒక జేసీబీ వాహనాన్ని స్వామీజీ అనుచరులు తగులబెట్టారు.

అసలు స్వామీజీని పోలీసులు ఎందుకు అరెస్టు చేయాలనుకున్నారు?

ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్న రాంపాల్ స్వామీజీపై హర్యానా-పంజాబ్ ఉమ్మడి హైకోర్టు కంటెమ్ట్ ఆప్ కోర్టు కింద అరెస్టు వారెంట్ జారీ చేసింది. శుక్రవారంలోగా ఆయనను కోర్టుకు హాజరుపర్చాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో పోలీసులు, పారా మిలటరీ బలగాలు మంగళవారం స్వామీజీ ఆశ్రమం వద్దకు చేరుకున్నారు. ఆశ్రమం లోపలికి వెళ్లి స్వామీజీని అరెస్టు చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలను రాంపాల్ అనుచరులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్నాయి.

రాంపాల్ అనుచరులు చట్టానికి కట్టుబడి ఉండాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. బలగాలను తొలగించాలంటూ రాంపాల్ అనుచరలు జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఆశ్రమం వద్ద మీడియా ప్రతినిధులపై పోలీసుల దాడిని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ), ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలు తీవ్రంగా ఖండించాయి. రెండు వారాల్లోగా నివేదిక ఇవ్వాలంటూ హర్యానా డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+