Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలీస్ స్టేషన్‌లో మర్డర్.. కన్నకొడుకును తుపాకీతో కాల్చిన తండ్రి..!

గోరఖ్‌పూర్ : కన్నకొడుకును పోలీస్ స్టేషన్‌లో తుపాకీతో కాల్చి చంపాడు ఓ తండ్రి. క్షణికావేశంలో కోపం ఆపుకోలేని సదరు తండ్రి కన్నకొడుకని చూడకుండా కాల్చివేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని చౌరీ చౌరా పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చౌరీ చౌరా పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అర్వింద్ యాదవ్ తన లైసెన్స్‌డ్ తుపాకీతో కాల్చి చంపాడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉండటంతో మొదటి భార్య, కొడుకు ఘజిపూర్‌లో నివాసం ఉంటున్నారు. రెండో భార్యతో కలిసి అర్వింద్ యాదవ్ చౌరీ చౌరా ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకున్నాడు. ఆ క్రమంలో మొదటి భార్య కొడుకు తండ్రితో తరచుగా గొడవ పడుతున్నాడు.

police constable firing on son in up chouri choura police station

అదలావుంటే గురువారం (24.10.2019) నాడు తండ్రిని కలిసి మాట్లాడేందుకు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు మొదటి భార్య కొడుకు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అది కాస్తా వాగ్వాదానికి దారి తీయడంతో అర్వింద్ యాదవ్‌కు సహనం నశించింది. దాంతో తన లైసెన్స్‌డ్ గన్ కొడుకు పైకి ఎక్కుపెట్టి కాల్చాడు. ఆ క్రమంలో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనపై సీఐ సుమిత్ శుక్లా మాట్లాడుతూ అర్వింద్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఆయనపై కేసు నమోదు చేయగమే గాకుండా లైసెన్స్‌డ్ తుపాకీ కూడా సీజ్ చేసినట్లు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+