ప్రధాని మోడీ, రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన గుజరాత్ పోలీసులు, అందుకే ఇవ్వలేం !

అహ్మదాబాద్: శాంతి భద్రతల సమస్యలు ఎదురౌతాయని ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ర్యాలీలు, బహిరంగ సభలకు అవకాశం ఇవ్వలేమని గుజరాత్ లోని అహ్మదాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు.

అహ్మదాబాద్ నగర పోలీసు కమిషనర్ అనూప్ కుమార్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అహ్మదాబాద్ లో పర్యటించటానికి ఏర్పాట్లు చేసుకున్నారని గుర్తు చేశారు.

Police denies permission to PM Narendra Modi, Rahul Gandhi rallies in Ahmedabad

ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ ఒకే రోజు నగరంలో పర్యటిస్తే శాంతిభద్రతల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అహ్మదాబాద్ సిటీ పోలీసు కమిషనర్ అనూప్ కుమార్ సింగ్ అన్నారు. శాంతి భద్రతల సమస్యలు ఎదురౌతాయని ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ రోడ్‌ షోలు, బహింరంగ సభలకు అనుమతి నిరాకరించామని వివరించారు.

గుజరాత్‌ రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్‌ గాంధీ అహ్మదాబాద్‌లో పర్యటించవలసి ఉంది. అయితే శాంతి భద్రతలతో పాటుగా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని నగర పోలీసు కమిషనర్ అనూప్ కుమార్ సింగ్ తెలిపారు. గుజరాత్‌ లో ఇప్పటికే తొలి దశ శాసన సభ ఎన్నికల పోలింగ్‌ పూర్తి అయిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+