వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

hyd show affect, ఢిల్లీలో మునావర్ ఫరూఖీ షో రద్దు, వీహెచ్‌పీ లేఖ

|
Google Oneindia TeluguNews

కమెడీయన్ మునావర్ ఫరూఖీ ఇప్పుడు ఫేమస్ అయిపోయారు. హైదరాబాద్‌లో నిర్వహించిన షోతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా తెలిసిపోయారు. అంతకుముందు కొందరీకే తెలిసేవారు.. ఇప్పుడు మాత్రం ఫేమ్ అయ్యారు. హైదరాబాద్ షో నిర్వహించొద్దు అని బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. ఆ తర్వాత వీడియోలు పోస్ట్ చేయడం.. ఒక వర్గం ప్రజలు ఆందోళనకు దిగనిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీలో షో చేయాలని మునావర్ ఫరూఖీ అనుకున్నారు. అక్కడ ఆయనకు చుక్కెదురు అయ్యింది.

ఢిల్లీలో నిర్వహించే షోకు పోలీసులు అనుమతి ఇవ్వలేదుు. హైదరాబాద్‌లో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని పర్మిషన్ ఇవ్వలేదు. అంతేకాదు ప్రొగ్రామ్ రద్దు చేయాలని వీహెచ్‌పీ లేఖ రాసిందట.. ఈ విషయాన్ని సిటీ పోలీస్ చీఫ్ తెలిపారు. వాస్తవానికి ప్రొగ్రాం ఆదివారం మధ్యాహ్నాం కేదార్ నాథ్ సాహ్ని ఆడిటోరియంలో వద్ద చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దానిని రద్దు చేశారు.

Police Denies Permission To Munawar Faruquis Delhi Show

ఇటీవల హైదరాబాద్‌లో మునావర్ ఫరూఖీ షో జరిగింది. ఆ షోకు మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. షో నిర్వహించొద్దని రాజా సింగ్ విన్నవించారు. అయినా షో నిర్వహించడంతో వీడియో పోస్ట్ చేశారు. అందులో మహ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా కామెంట్స్ ఉన్నాయట. రాజా సింగ్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. దీంతో బీజేపీ హైకమాండ్ స్పందించింది. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఢిల్లీలో కూడా ఫరూఖీ షోను పోలీసులు మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని రద్దు చేశారు. రాజా సింగ్ ఇష్యూ దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో షో రద్దు గురించి ఫరూఖీ ఏమంటారో చూడాలీ మరీ.

English summary
Police have denied permission to stand-up comedian Munawar Faruqui's show in central Delhi to maintain communal harmony after Vishwa Hindu Parishad wrote letter to city police chief to cancel the program.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X