బీహార్ పోలీసులు ఇంతే, మెడకు తాడుకట్టి ఈడ్చేశారు (వీడియో)
వైశాలి/ పాట్నా: బీహార్ పోలీసుల అమానుషత్వం మరోసారి బయటపడింది. ఓ మృతదేహం మెడకు తాడు కట్టి వందల మీటర్ల దూరం ఈడ్చుకుని వెళ్లి రాక్షసుల్లా ప్రవర్తించారు. బీహార్ లోని వైశాలి జిల్లాలో ఈ దారుణం జరిగింది.
వైశాలి జిల్లాలోని గంగానదిలో ఓ మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండు గంటల తరువాత పోలీసులు చేతులు ఊపుకుంటు అక్కడికి వెళ్లారు. పోలీసులు తమ వెంట ఆంబులెన్స్ కాని, పనివారిని కాని తీసుకు వెళ్లలేదు.

చివరికి మృతదేహం మెడకు తాడు కట్టి బయటకులాగారు. తరువాత మృతదేహాన్నితాడుతో ఈడ్చుకుని వందల మీటర్ల దూరంలో నిలిపి ఉన్న వాహనం దగ్గరకు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న పై అధికారులు ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications