Illegal affair: స్పైసీ ఫుడ్ లో భర్తకు విషం పెట్టి చంపేసిన భార్య, 7 హత్యలు చేసిన ప్రియుడితో !
చెన్నై/ కన్యాకుమారి: భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య ఇద్దకు కుమార్తెలకు తల్లి అయ్యింది. మెట్రో రైలులో ఉద్యోగం చేస్తున్న భార్య ఉదయం వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తోంది. మెట్రోలో పని చెయ్యడానికి వెలుతున్న సమయంలో పరిచయం అయిన వ్యక్తితో భార్య చనువు పెంచుకునింది. భర్త చేదుకావడం, ప్రియుడు స్వీట్ గా ఉండటంతో భార్య అతనితో అక్రమ సంబంధం పెట్టుకునింది. భర్తకు టోపీ పెడుతూ వచ్చిన భార్య తనకు పని ఒత్తిడి ఎక్కువ అయ్యింది అంటూ రాత్రి లేటుగా ఇంటికి రావడం మొదలు పెట్టింది.
నిజంగానే భార్య పని ఒత్తిడితో ఉందని భర్త కొంతకాలం చూసిచూడన్లు ఉన్నాడు. భర్తకు మడత ఖాజా తినిపించిన భార్య ప్రియుడికి రసగుల్లాలు తినిపిస్తూ అతనితో ఎంజాయ్ చేస్తూ ప్రపంచాన్ని మరిచిపోయింది. కొంతకాలానికి భార్య అక్రమ సంబంధం గురించి భర్తకు తెలిసిపోయింది. అసలే మద్యం సేవించడం అలవాటు ఉన్న భర్త అతని భార్యను నిలదీశాడు. తాను ఎవ్వరితో అక్రమ సంబంధం పెట్టుకోలేదని, నువ్వు తప్పా తనకు ఏ మగవాసన తెలీదని భార్య చందమామ కథలు చెప్పింది. అయితే భార్య తీరుతో రగిలిపోయిన భర్త ఆమెను పట్టుకుని చితకబాదుతున్నాడు. తన భర్త బతికుంటే తన జల్సాలకు అడ్డు వస్తాడని భయపడిన భార్య మొగుడిని చంపేయాలని డిసైడ్ అయ్యింది.
మంచి నాటుకోడి పులుసు, కుష్కా స్పైసీగా చేసిన భార్య అందులో విషం కలిపి భర్తకు పెట్టింది. విషం కలినిన చికెన్ తిన్న భర్త ఆసుపత్రిపాలైనాడు నాలుగు రోజులు ఆసుపత్రిలో యుముడితో పోరాటం చేసిన భర్త ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తన భర్త పీకలదాక మద్యం సేవించి ఇంటికి వచ్చి భోజనం చేశాడని, తరువాత అతను ఊపిరిఆడక మరణించాడని భార్య అందర్ని నమ్మించింది. అయితే పోలీసుల విచారణలో భార్య ఆమె భర్తను విషం పెట్టి చంపేసిందని, భార్య సీక్రేట్ ప్రియుడి మీద ఇప్పటికే 7 హత్య కేసులు, నాగులు హత్యాయత్నం కేసులతో పాటు అనేక క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని వెలుగు చూడటం కలకలం రేపింది.
First
night:
ఫస్ట్
నైట్
బెడ్
రూమ్
లో
పెళ్లి
కొడుకు
ఆత్మహత్య.
పెళ్లి
కూతురు
చూసి,
ఏం
జరిగిందింటే
!

భర్తతో చక్కగానే ఉండేది
తమిళనాడులోని చెన్నై సిటీలోని చూలైమేడులోని కన్నగ వీధిలో సెల్వం (42) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం విజయలక్ష్మి (38) అనే మహిళతో సెల్వం వివాహం జరిగింది. భర్త సెల్వంతో సంతోషంగా కాపురం చేసిన అతని భార్య విజయలక్ష్మి ఇద్దరు కుమార్తెలకు తల్లి అయ్యింది. భార్య విజయలక్ష్మి, ఇద్దరు కుమార్తెలతో కలిసి చాలా కాలం సెల్వం సంతోషంగానే జీవనం సాగించాడు.

మెట్రోలో ఉద్యోగం చేస్తున్న భార్య
చెన్నై మెట్రలో సంస్థలో విజయలక్ష్మి ఉద్యోగం చేస్తోంది. మెట్రో రైలులో ఉద్యోగం చేస్తున్న సెల్వం భార్య విజయలక్ష్మి ఉదయం ఇంటి నుంచి వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తోంది. మెట్రోలో పని చేస్తున్న విజయలక్ష్మికి కన్యాకుమారికి జిల్లాకు చెందిన మోహన్ అనే వ్యక్తి పరిచయం కావడంతో ఆమె అతనితో చనువు పెంచుకుంది.

భార్య అక్రమ సంబంధం
ప్రియుడు మోహన్ మోజులో పడిపోయిన విజయలక్ష్మి పగలు టైమ్ చిక్కినప్పుడు అతనితో తిరుగుతూ ఎంజాయ్ చేసింది. రానురాను భర్త సెల్వం చేదుకావడం, ప్రియుడు మోహన్ స్వీట్ గా ఉండటంతో విజయలక్ష్మి అతనితో అక్రమ సంబంధం పెట్టుకునింది. భర్త సెల్వంకు టోపీ పెడుతూ వచ్చిన భార్య తనకు పని ఒత్తిడి ఎక్కువ అయ్యింది అంటూ రాత్రి లేటుగా ఇంటికి రావడం మొదలు పెట్టింది. నిజంగానే భార్య విజయలక్ష్మి పని ఒత్తిడితో ఉందని ఆమె భర్త సెల్వం కొంతకాలం చూసిచూడట్లు ఉన్నాడు.

భర్తకు మడత ఖాజా.... ప్రియుడికి రసగుల్లాలు
రానురాను భర్త సెల్వంకు మడత ఖాజా తినిపించిన అతని భార్య విజయలక్ష్మి ఆమె ప్రియుడు మోహన్ కు మాత్రం రసగుల్లాలు తినిపిస్తూ అతనితో ఎంజాయ్ చేస్తూ ప్రపంచాన్ని మరిచిపోయింది. ప్రియుడు మోహన్ మోజులో పడిపోయిన విజయలక్ష్మి ఆమె భర్త సెల్వం, కూతుర్లను పూర్తిగా నిర్లక్షం చేస్తూ వచ్చింది.

మొగుడికి చందమామ కథలు చెప్పిన భార్య
కొంతకాలానికి భార్య విజయలక్ష్మి అక్రమ సంబంధం గురించి ఆమె భర్త సెల్వంకు తెలిసిపోయింది. అసలే మద్యం సేవించడం అలవాటు ఉన్న సెల్వం అతని భార్య విజయలక్ష్మిని నిలదీశాడు. తాను ఎవ్వరితో అక్రమ సంబంధం పెట్టుకోలేదని, నువ్వు తప్పా తనకు ఏ మగవాసన తెలీదని సెల్వంకు అతని భార్య విజయలక్ష్మి చందమామ కథలు చెప్పింది.

నా భర్త బతికుంటే చాలా కష్టం
భార్య విజయలక్ష్మి తీరుతో రగిలిపోయిన భర్త సెల్వం ఆమెను పట్టుకుని చితకబాదుతున్నాడు. తన భర్త సెల్వం బతికుంటే తన జల్సాలకు అడ్డు వస్తాడని భయపడిన భార్య విజయలక్ష్మి ఆమె మొగుడిని చంపేయాలని డిసైడ్ అయ్యింది. తన భర్త సెల్వంను చంపేసి జీవితాంతం నీతోనే ఉంటానని విజయలక్ష్మి అతని ప్రియుడు మోహన్ కు చెప్పింది.

ఫుడ్ లో భర్తకు విషం కలిపి పెట్టిన భార్య
సెల్వంను హత్య చెయ్యడానికి ఓకే చెప్పిన మోహన్ అతని ప్రియురాలు విజయలక్ష్మికి విషం బాటిల్ తెచ్చి ఇచ్చాడు. ఈనెల 2వ తేదీ స్పైసీగా మంచి నాటుకోడి పులుసు, కుష్కా చేసిన భార్య విజయలక్ష్మి అందులో విషం కలిపి ఆమె భర్త సెల్వంకు పెట్టింది. విషం కలిపిన చికెన్ తిన్న సెల్వం ఆసుపత్రిపాలైనాడు. నాలుగు రోజులు ఆసుపత్రిలో యుముడితో పోరాటం చేసిన సెల్వం ఈనెల 6వ తేదీన సెల్వం ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

లిక్కర్ తాగి చనిపోయాడని నాటకాలు ఆడిన భార్య
తన భర్త సెల్వంకు విపరీతంగా మద్యం సేవించే అలవాటు ఉందని, రెండవ తేదీన పీకలదాక మద్యం సేవించి ఇంటికి వచ్చి భోజనం చేశాడని, తరువాత అతను ఊపిరిఆడక కిందపడిపోతే ఆసుపత్రికి తరలించారని, తరువాత చికిత్స విఫమలై మరణించాడని విజయలక్ష్మి పోలీసులు, కుటుంబ సభ్యులను నమ్మించింది.

పక్కాస్కెచ్ తో చంపేశారని రిపోర్టు
సెల్వం చనిపోయిన తరువాత అతని శవానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆహారంలో విషం కలపడం వలనే సెల్వం ప్రాణాలు పోయాయని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. భర్త సెల్వంను చంపేసిన విజయలక్ష్మి ఆమె ప్రియుడు మోహన్ తో రోజు గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతూ కులుకుతోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
Recommended Video

ప్రియుడు పక్కా క్రిమినల్..... 420
సెల్వం భార్య విజయలక్ష్మి సీక్రేట్ ప్రియుడు మోహన్ మీద ఇప్పటికే 7 హత్య కేసులు, నాలుగు హత్యాయత్నం కేసులతో పాటు అనేక క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని పోలీసులు అంటున్నారు. చెన్నై, కన్యాకుమారి, తిరునల్వేలి, టుటికోరిన్ తో పాటు అనేక జిల్లాల్లో అతని మీద కేసులు ఇంకా విచారణ పెండిగ్ లో ఉన్నాయని పోలీసులు అంటున్నారు. క్రిమినల్ ప్రియుడు మోహన్ అండ చూసుకుని అతని ప్రియురాలు విజయలక్ష్మి కట్టుకున్న భర్త సెల్వంను విషం పెట్టి హత్య చెయ్యడం చెన్నైలో కలకలం రేపింది.