నాతో ఒక్క రాత్రి పడుకో: రూ. లక్షలు వద్దు, స్మగ్లర్ భార్య అందానికి, పోలీసు ఆఫీసర్ ఆఫర్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

జైపూర్: డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన తన భర్తను విడిపించుకునేందుకు వెళ్లిన ఓ మహిళకు పోలీసు అధికారి వికృత ఆఫర్ ఇచ్చాడు. డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు నీభర్తను వదిలేస్తాను, అయితే నాతో ఓ రాత్రి మొత్తం పడుకో, నాతో ఎంజాయ్ చెయ్యి అంటూ తన వికృత చేష్టలు ప్రదర్శించాడు.

కొడుకు కోసం తలుపు తీస్తే పక్కింటి ఆంటీని రేప్ చేశాడు: మళ్లీ వస్తా, చాన్స్ అంటూ వార్నింగ్ !

రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఓ స్మగ్లర్ భార్యకు ఎదురైన ఈ ఘటనపై అధికారులు విచారించారు. వికృతరూంలో ఉన్న పోలీసు అధికారి కమల్ దాన్ చరణ్ అనే పోలీసు అధికారిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని అవినీతి నిరోదక దళం (ఏసీబీ) ఎస్పీ అజయ్ పాల్ లంబా మీడియాకు చెప్పారు.

డ్రగ్స్ తరలించాడు !

డ్రగ్స్ తరలించాడు !

జైపూర్ కు చెందిన ఓ వ్యక్తి కారులో డ్రగ్స్ (ఓపిమ్) తరలిస్తున్న సమయంలో పోలీసులు అతనిని వెంబడించారు. అయితే అతను కారులో చాకచక్యంగా తప్పించుకున్నాడు. పోలీసుల కళ్లుగప్పి చీకటిలో మాయం అయ్యి స్థానిక పోలీసులకు సినిమా చూపించాడు.

జోధ్ పూర్ లో సినిమా !

జోధ్ పూర్ లో సినిమా !

జోధ్ పూర్ లోని రాజీవ్ గాంధీ పోలీస్ స్టేషన్ లో ఇన్ చార్జ్ (ఎస్ హెచ్ ఓ) అధికారిగా కమల్ దాన్ చరణ్ పని చేస్తున్నాడు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి చివరికి రాజీవ్ గాంధీ పోలీస్ స్టేషన్ సిబ్బందికి చిక్కిపోయాడు. అతనిని అరెస్టు చేసి కారు, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

స్మగ్లర్ భార్య వచ్చింది !

స్మగ్లర్ భార్య వచ్చింది !

తన భర్తను అరెస్టు చేశారని తెలుసుకున్న స్మగ్లర్ భార్య రాజీవ్ గాంధీ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. తరువాత స్టేషన్ ఇన్ చార్జ్ కమల్ దాన్ చరణ్ ను కలిసింది. కేసు పెట్టకుండా నా భర్తను, కారును విడిచిపెట్టాలని కమల్ దాన్ చరణ్ ను వేడుకుంది.

ఓకే వదిలేస్తాను !

ఓకే వదిలేస్తాను !

స్మగ్లర్ భార్యతో కమల్ దాన్ చరణ్ ప్రత్యేకంగా మాట్లాడాడు. డ్రగ్స్ మేమే స్వాధీనం చేసుకుంటామని, నీ భర్తను, కారును మాత్రం విడిచిపెడుతామని పోలీసు అధికారి కమల్ దాన్ చరణ్ ఆమెకు మాట ఇచ్చాడు. నీభర్తను విడిచి పెట్టాలంటే రూ. 2 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

అప్పు చేసి తీసుకువస్తే !

అప్పు చేసి తీసుకువస్తే !

స్మగ్లర్ భార్య తనకు తెలిసిన వారి దగ్గర అప్పు చేసి రూ. లక్ష (నగదు) తీసుకు వచ్చి పోలీసు అధికారి కమల్ దాన్ చరణ్ కు ఇచ్చింది. మిగిలిన లక్ష రూపాయలకు ఓ చెక్ అతనికి ఇచ్చింది. లక్షరూపాయల నగదు, చెక్ తీసుకున్న కమల్ దాన్ చరణ్ రేపు నీ భర్తను విడిచిపెడుతానని ఆమెకు చెప్పాడు.

ఆమె అందానికి పిచ్చెక్కిపోయాడు !

ఆమె అందానికి పిచ్చెక్కిపోయాడు !

స్మగ్లర్ భార్య అందానికి పోలీసు అధికారి కమల్ దాన్ చరణ్ కు పిచ్చెక్కిపోయింది. మరుసటి రోజు ఆమె పోలీస్ స్టేషన్ కు రాగానే అక్కడ ఉన్న సిబ్బందిని బయటకు పంపించాడు. లక్ష రూపాయల చెక్ ఆమెకు వెనక్కి ఇచ్చేశాడు. నాకు చెక్ వద్దు డబ్బులే కావాలని చెప్పాడు.

నాతో ఒక్క రాత్రి పడుకో !

నాతో ఒక్క రాత్రి పడుకో !

నా దగ్గర ప్రస్తుతం డబ్బులేదని, డబ్బు చేతికి అందగానే మీకు సమాచారం ఇస్తానని, చెక్ తో రూ. లక్ష డ్రా చేసుకోవాలని ఆమె మనవి చేసింది. లక్ష రూపాయలు ఇవ్వకపోయినా పర్వాలేదు, నాతో ఒక్క రాత్రి పూర్తిగా శారీకంగా గడిపితే మరుసటి రోజు నీ భర్తను వదిలేస్తానని కమల్ దాన్ చరణ్ ఆమెకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు

ఏసీబీ ఎస్పీకి చెప్పింది !

ఏసీబీ ఎస్పీకి చెప్పింది !

పోలీసు అధికారి కమల్ దాన్ చరణ్ వికృత ఆఫర్ విని హడలిపోయిన బాధితురాలు ఏసీబీ ఎస్పీ అజయ్ పాల్ లంబాకు సమాచారం ఇచ్చింది. తనకు న్యాయం చెయ్యాలని మనవి చేసింది. ఎస్పీ అజయ్ పాల్ లంబా పక్కా ప్లాన్ వేసి ఆమె దగ్గర లక్ష రూపాయలు డబ్బు ఇచ్చి పోలీసు అధికారి కమల్ దాన్ చరణ్ కు ఇవ్వాలని చెప్పాడు.

నీతో పడుకోలేను !

నీతో పడుకోలేను !

మీతో ఓ రాత్రి గడపడం నాకు ఇష్టం లేదని, మీరు అడిగిన లక్షరూపాయలు ఇస్తానని స్మగ్లర్ భార్య పోలీసు అధికారి కమల్ దాన్ చరణ్ కు చెప్పింది. సరే వచ్చి ఇవ్వు అని ఆమెకు చెప్పాడు. స్మగ్లర్ భార్య దగ్గర పోలీస్ స్టేషన్ సమీపంలో లక్ష రూపాయల లంచం తీసుకుంటున్న పోలీసు అధికారి కమల్ దాన్ చరణ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని ఏసీబీ ఎస్పీ అజయ్ పాల్ లంబా మీడియాకు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A police official was on Tuesday arrested by Anti-Corruption Bureau sleuths for allegedly seeking sexual favours and taking a bribe of Rs two lakh from the wife a person who is accused in a drug case.
Please Wait while comments are loading...