ఫేస్‌బుక్‌లో శవం ఫొటో: తన భార్యగా గుర్తించిన వ్యక్తి
మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన తన భార్య శవాన్ని ఓ వ్యక్తి గుర్తించాడు. భాస్కర్ కథనం ప్రకారం - మీరట్‌లో ఓ అమ్మాయి శవం కనిపించింది. జిమ్కానా సమీపంలో పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో అమ్మాయిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడి ఆమె మరణించింది. వరుసగా అడ్వర్టయిజ్‌మెంట్లు ఇచ్చినా ఆ శవం గుర్తింపు సాధ్యపడలేదు. దాంతో పోలీసులు శవం ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

ఆ శవాన్ని గుర్తించిన భర్త పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. శవాన్ని తనకు అప్పగించాలని కోరాడు. ఆమెను నోయిడాలోని నేహాగా గుర్తించారు.
అంత రాత్రి వేళ ఆమె అక్కడికి వచ్చింది, అక్కడ ఏం చేసిందనేది తెలియడం లేదు. ఆమెను ఎందుకు హత్య చేశారనేది కూడా అంతు పట్టడం లేదు.












Click it and Unblock the Notifications