అయోధ్య రామ మందిరం, ఆ విషయంలో జాగ్రత్త, సైబర్ క్రైమ్ అయితే 1930 నెంబర్ కు ఫోన్!

భారతదేశంలోని పలు నగరాలు, పట్టణాలు, చివరికి గ్రామాలు దాదాపుగా అంతా రామమయం అయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య (Ayodhya)లో ఎటు చూసినా అంతా రామమయమే అయ్యింది. అయోధ్య రామనామ సంకీర్తనలు వినిపిస్తున్నాయి. ప్రతి హిందువు తల ఎత్తుకుని గర్వంగా జై శ్రీరామ్, జై భజరంగ్ బలి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా శ్రీరాముడి ఫోటోలతో ముద్రించిన కాషాయం జెండాలు రెపరెపలాడుతున్నాయి.

నాలుగు చక్రాల వాహనాలు, బస్సులు, లారీలు, క్యాంటర్లు, కార్లు, బైక్ లు ఇలా దాదాపుగా అన్ని వాహనాలకు చిన్నచిన్న కాషాయం జెండాలు కట్టుకుని రోడ్డు మీద రయ్ రయ్ అని వెలుతున్నారు. అయోధ్యలో ఆధ్యాత్మికశోభ ఉట్టిపడేలా భారీ సెట్టింగులు వేశారు. కళ్లు జిగేల్ అనేలా రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వేలాది మంది వీవీఐపీలు అయోధ్యలో అడుగుపెట్టడంతో చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అయోధ్యలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Police said people should be wary of cyber criminals in connection with Ayodhya Ram Mandir

భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం ఇప్పుడు అయోధ్యలోని రామ మందిరం గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్బంగా అమాయకులను టార్గెట్ చేసుకున్న సైబర్ మోసగాళ్లు ఇప్పుడు భారీ దందాకు తెరలేపారని వెలుగు చూసింది. ఇలాంటి మోసాలకు చెక్ పెట్టడానికి సైబర్ పోలీసులు రంగంలోకి దిగారు.

అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత సైబర్ మోసాల నెట్‌వర్క్ చురుగ్గా పని చేస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు అంటున్నారు. సైబర్‌ మోసాల గురించి ఎలా తెలుసుకోవాలో సైబర్‌ సెక్యూరిటీ కర్ణాటక సెంటర్‌ హెడ్‌ కార్తీక్‌ రావు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అయోధ్య అంశం ట్రెండింగ్‌లో ఉందని, అందుకే ఈ విషయంలో ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారని కార్తీక్ రావు అన్నారు.

అయోధ్య రామ మందిరం విషయంలో ఎవరినీ అంత తేలిగ్గా నమ్మొద్దు. మీరు వారిని విశ్వసించకపోతే వారితో సంభాషించవద్దని, ఇలాంటి నెట్‌వర్క్‌లో చిక్కుకుంటే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కార్తీక్ రావు ప్రజలకు మనవి చేశారు. ఎవరైనా మోసపోయిన వెంటనే మీరు 1930కి ఫోన్ చేసి సమాచారం అందిస్తే మీరు డబ్బు పంపిన ఖాతా వెంటనే బ్లాక్‌ అవుతుందని, తరువాత మీ డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందని కార్తీక్ రావు తెలిపారు. ముఖ్యంగా వాట్సాప్ మెసేజ్‌లను అంతసులభంగా నమ్మవద్దు అని కార్తీక్ రావు ప్రజలకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+