వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాధ్వీ ఇంట్లో కోటి నగదు, 24 బంగారు కడ్డీలు స్వాధీనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

గుజరాత్ :గుజరాత్ రాష్ట్రంలోని సాధ్వీ జైగిరి ఇంట్లో 24 బంగారు కడ్డీలను, కోటి రూపాయాలకు పైగా కొత్త రెండు వేల రూపాయాల కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.బంగారం వ్యాపారి ఫిర్యాదు మేరకు సాధ్వీ జైగిరిని అరెస్టు చేశారు పోలీసులు.

ఆధ్యాత్మిక ప్రసంగాలుచేసే సాధ్వీ జైగిరి నివాసంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని, నగదు దొరకడం సంచలనం కల్గించింది.

కొత్త రెండు వేల రూపాయాలు అందుబాటులోకి ఇంకా పూర్తిగా రాని సమయంలో సాథ్వీ జై శ్రీగిరి గత ఏడాది డిసెంబర్ మాసంలో నిర్వహించిన కార్యక్రమంలో గాయనీ గాయకులపై కోటి రూపాయాల విలువైన రెండు వేల రూపాయాలను విసిరారు.

సాధ్వీ గాయకులపై నోట్లను విసిరిన వీడియో సంచలనంగా మారింది.అయితే గుజరాత్ లో బనస్కాంత జిల్లాలోని ట్రస్టును ఆమె నిర్వహిస్తున్నారు.

police seized 24 gold bars,more than one crore currency from sadhvi srijaigiri home

ఓ బంగారం వ్యాపారి వద్ద బంగారం కొనుగోలు చేసి, ఆయనకు ఐదు కోట్లు చెల్లించలేదు. ఈ విషయమై సాథ్వీకి పలుమార్లు కోరినా పట్టించుకోలేదు. దీంతో ఆ నగల వ్యాపారి సాథ్వీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆమె ఇంటి నుండి 80 లక్షల విలువైన 24 బంగారు కడ్డీలు, 1.2 కోట్ల రూపాయాల నగదు పట్టుబడ్డాయి . ఇందులో రెండువేల రూపాయాల నగదు కావడం విశేషం.

English summary
police seized 24 gold bars,more than one crore currency from sadhvi srijaigiri home
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X