Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విదేశాల నుంచి బాంబు బెదిరింపులు, 68 స్కూల్స్ ను టార్గెట్ చేసిన ఆదేశాలు ఏవో తెలుసా ?

ఐటీ హబ్ బెంగళూరు సిటీలోని 48 పాఠశాలలకు, బెంగళూరు నగర శివార్లలోని పరిసర ప్రాంతాల్లోని 20 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాసంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న సిబ్బందిలో ఆందోళన నెలకొంది. గతంలో ఇలా నకిలీ బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి కాల్స్, ఈమెయిల్స్‌కు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భయపడవద్దని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ బి. దయానంద మనవి చేశారు.

ఈసారి 68 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం జరిగింది. బాంబు బెదిరింపు ఈమెయిల్‌లో ఉగ్రవాదులు ఉపయోగించే హింసాత్మక భాష ప్రస్తావించడం వల్ల భయం ఎక్కువ అయ్యిందని సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ సీరియస్‌గా తీసుకుంది. భద్రత దృష్ట్యా పాఠశాల యాజమాన్యం శుక్రవారం పిల్లలను ఇంటికి పంపించింది. కొన్ని పాఠశాలలకు శనివారం కూడా సెలవులు ప్రకటించారు.

Police suspect that the schools in Bengaluru have received bomb threat emails from two countries,

అలాగే బెంగళూరు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన ఈమెయిల్ ఐడిల ద్వారా పంపబడ్డాయి, అన్ని ఇమెయిల్‌లు [email protected] నుండి పంపబడ్డాయి. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఈ ఇమెయిల్‌లు చెక్ రిపబ్లిక్, స్లోవేకియా దేశాల నుండి వచ్చినట్లు పోలీసు అధికారులు, సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. బెంగళూరు నగరంలో గతేడాది నుంచి ఇలా బాంబు బెదిరింపులు రావడం ఇది మూడో సారి.

2023 ఏప్రిల్ 28వ తేదీన సౌదీ అరేబియా నుండి పంపిన ఈమెయిల్‌ల ద్వారా బెంగళూరు సిటీలో, నగర శివార్లలోని చుట్టుపక్కల ఉన్న 25కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మళ్లీ జూన్ 15వ తేదీన పశ్చిమాసియాలోని గుర్తుతెలియని దేశం నుంచి మరో రెండు పాఠశాలలకు ఇలాంటి ఈ మెయిల్స్ బాంబు బెదిరింపు లేఖలు వచ్చాయి. ఇలా నిత్యం ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో విద్యార్థులు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శుక్రవారం నాటి సంఘటనలో బాంబు బెదిరింపు ఈమెయిల్‌ను గమనించిన మొదటి పాఠశాలల్లో ఒకటి బెంగళూరు ఈస్ట్ లోని వైట్‌ఫీల్డ్‌లోని యెమ్లూర్‌లోని నీవ్ అకాడమీ. పోలీసు సిబ్బంది, బాంబు స్క్వాడ్ టీమ్ సభ్యులు పాఠశాలకు చేరుకుని క్యాంపస్‌ను పరిశీలించడం ప్రారంభించారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో బెంగుళూరు వెస్ట్ లోని బసవేశ్వర్ నగర్, కెంగేరి, బెంగళూరు నార్త్ లోని యలహంకలోని అనేక పాఠశాలలు బెదిరింపు ఈమెయిల్‌లు రావడంతో పోలీసులను అప్రమత్తం అయ్యారు.

Police suspect that the schools in Bengaluru have received bomb threat emails from two countries,

ఉదయం 9 గంటలకు కనీసం 20 బాంబు నిర్వీర్యదళం బృందాలు క్యాంపస్ నుండి క్యాంపస్‌కు చేరుకున్నాయి. అప్పటికి బెంగళూరు సిటీజిగాణి, హెబ్బగోడి, రాజానుకుంటలోని మరిన్ని పాఠశాలలకు ఇలాంటి బెదిరింపు ఈమెయిల్స్‌ వచ్చాయి. మా టీమ్‌లు అన్ని పాఠశాలలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి, అయితే ఎలాంటి బాంబులు చిక్కలేదని పోలీసు అధికారులు తెలిపారు.

గతంలో కూడా ఇలాంటి నకిలి బంబు బెదిరింపులు వచ్చాయని, కేసును దర్యాప్తు చేస్తున్నామని బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ బి దయానంద అన్నారు. ఇస్లాంలోకి మారండి లేదా భారీ పరిణామాలు ఎదుర్కొండి అంటూ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ ద్వారా ఈమెయిల్స్ పంపబడిందని, క్షుణ్ణంగా విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+