కాలేజ్ అమ్మాయి కిడ్నాప్, గ్యాంగ్ రేప్ చేసి చంపేసిన పోలీసులు, పక్కలో స్టూడెంట్ !
జైపూర్/రాజస్థాన్: డిగ్రీ చదువుతున్న యువతి కాలేజ్ కు వెళ్లి వస్తోంది. సాయంత్రం పూట ఆ యువతి కంప్యూటర్ క్లాసులకు వేరే చోట కొచింగ్ కు వెలుతోంది. ఇదే సమయంలో ఓ యువకుడు ఆ యువతిని ప్రేమించాలని వెంటపడ్డాడు. ఎవడు అయితే అమ్మాయి వెంటపడి ఆమెను టార్చర్ పెడుతున్నాడో వాడే ఇద్దరు కానీస్టేబుల్స్ తో కలిసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. పోలీసులతో కలిసి ప్రేమిస్తున్న అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసి అందరూ కలిసి ఆమెను చంపేయడం కలకలం రేపింది.
రాజస్థాన్‌లోని బైకనార్‌లోని ఖజువాలాలో 20 ఏళ్ల యువతి నివాసం ఉంటోంది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆ యువతి తన ఇంటికి సమీపంలోని కోచింగ్ సెంటర్‌లో కంప్యూటర్ క్లాస్‌లకు ప్రతిరోజు వెళ్లి వస్తోంది. గత రెండు వారాల నుంచి కంప్యూటర్ క్లాస్‌కు వెళుతున్న యువతి వెంట స్థానికంగా ఉన్న దినేష్ అనే విద్యార్థి పడ్డాడు, తనను ప్రేమించాలని, తన కోరికలు తీర్చాలని ఆ యువతిని దినేష్ వేధిస్తున్నాడు.

వారం రోజుల నుంచి దినేష్ వేధింపులు ఎక్కువ కావడంతో యువతి ఆమె కుటుంబ కుటుంబ సభ్యులకు, కంప్యూటర్ శిక్షణ ఇస్తున్న ఆ కంప్యూటర్ కేంద్రం యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. అయినా దినేష్ టార్చర్ పెట్టడంతో విసిగిపోయిన ఆ యువతి స్థానిక పోలీసుల దృష్టికి కూడా ఈ మ్యాటర్ తీసుకెళ్లి దినేష్ మీద చర్యలు తీసుకోవాలని మనవి చేసింది.
అయినప్పటికీ దినేష్ ఆమెను వేధించడం కొనసాగించాడు. జూన్ 20వ తేదీ మంగళవారం యువతి కంప్యూటర్ క్లాస్ కు బలుదేరింది. ఆ సమయంలో దినేష్, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఉద్యోగాలు చేస్తున్న కానిస్టేబుళ్లు మనోజ్ కుమార్, పర్యాత్ కుమార్ కలిసి యువతిని కారులో కిడ్నాప్ చేశారు. నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లిన కామాంధులు ఆ యువతి మీద సామూహిక అత్యాచారం చేశారు. యువతి మీద పదేపదే రాక్షసులు గ్యాంగ్ రేప్ చెయ్యడంతో ఆయువతి మృతి చెందింది.
యువతి శవాన్ని అక్కడే వదిలేసిన దినేష్, ఇద్దరు పోలీసులు పరారైనారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు ఇద్దరు పోలీసులతో సహా దినేష్ ను అరెస్టు చేయ్యకుంటే యువతికి పోస్టుమార్టం నిర్వహించేందుకు అంగీకరించమని ఆందోళనకు దిగారు. యువతి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఐజీ ఓం ప్రకాష్ ప్రత్యేక దర్యాప్తు బృందంతో సమగ్ర విచారణ జరిపి మీకు న్యాయం చేస్తామని, ఇద్దరు కానిస్టేబుళ్లను ఇప్పటికే సస్పెండ్ చేశామని యువతి కుటుంబ సభ్యులకు చెప్పారు. ముగ్గురిని చట్టపరంగా శిక్షిస్తామని ఐజీ ఓం ప్రకాష్ యువతి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
దినేష్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎస్సీఎస్టీ వేధింపుల కేసుతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని, దినేష్ పరారీలో ఉన్నాడని పోలీసులు అంటున్నారు. అయితే కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసిన ఇద్దరు కానీస్టేబుల్స్ ను ఎందుకు అరెస్టు చెయ్యలేదు అనే విషయంలో పోలీసు అధికారలుు నీళ్లు నములుతున్నారని స్థానిక మీడియా తెలిపింది. నిందితులను అరెస్టు చేసే వరకు యువతి శవాన్ని తీసుకోమని మృతురాలి కుటుంబీకులు ధర్నా చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications