Prashanth Kishor: ప్రశాంత్ కిషోర్ పాదయాత్రకు బ్రేక్.. ఎందుకంటే..!

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. తనకు గాయం కారణంగా బీహార్‌లో జన్ సూరాజ్ పాదయాత్రలో నెల రోజుల పాటు దూరంగా ఉండొచ్చని తెలిపారు. గాంధీ జయంతి నాడు ప్రారంభమైన పాదయాత్ర ఇప్పుడు దాదాపు 15 రోజుల తర్వాత తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ప్రశాంత్ కిషోర్ ఎడమ కాలి కండరం చిట్లినట్లు వైద్యులు తెలిపారు. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

యాత్రకు విరామం ఇవ్వడానికి ప్రశాంత్ కిషోర్ మొదటగా నిరాకరించారు. కానీ సుదీర్ఘం పాదయాత్ర చేయాల్సి ఉండడంతో యాత్రకు బ్రేక్ వేశారు."పాదయాత్ర బీహార్‌లోని ప్రతి సందు, మూలను కవర్ చేయడానికి ఇంకా చాలా నెలలు పడుతుంది కాబట్టి, వైద్యం ప్రక్రియను అనుమతించడానికి నేను కొంతకాలం పాదయాత్ర నిలిపివేస్తున్నాను. దాదాపు 15 రోజుల తర్వాత ఈ ప్రదేశం నుంచి అదే ఫార్మాట్‌లో, అదే జోరుతో పాదయాత్ర పునఃప్రారంభిస్తా" ప్రశాంత్ కిషోర్ తెలిపారు.

Political Strategist Prashant Kishores Jan Sooraj Padayatra has come to a halt

గతేడాది గాంధీ జయంతి రోజున 'జన్‌ సూరజ్‌' పేరుతో సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు ప్రశాంత్ కిషోర్. బిహార్‌లోని పశ్చిమ చంపారన్‌ జిల్లాలో ప్రారంభమైన ఈ యాత్ర.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3500కి.మీ మేర కొనసాగనుంది. అయితే, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే అని చెబుతున్నా, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకే ఈ పాదయాత్ర చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

మొదటగా ఈ యాత్రకు అంతగా ప్రజాదరణ లేనప్పటికీ ఇటీవల జరిగిన మండలి ఉపఎన్నికలో కిశోర్‌ మద్దతు ఇచ్చిన అభ్యర్థి విజయం సాధించారు. బిహార్ లో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రశాంత్ కిషోర్ పాదయాత్రతో అయోమయానికి గురవుతున్నాయి. పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రచారంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+