యువతిపై గ్యాంగ్‌రేప్: వీడియో తీసి నెట్‌లో పెట్టారు

కుషినగర్: ఓ రాజకీయ నేత, ప్రముఖ విశ్వవిద్యాలయంలో ల్యాబ్ అసిస్టెంట్‌గా చేస్తున్న ఓ యువకుడు, అతని నలుగురు స్నేహితులతో కలిసి ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక, ఆ దారుణాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నెబువా నౌరంగియా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రధాన నిందితుడు రాజన్ గౌతమ్‌ను అరెస్ట్ చేశారు. మిగితా నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి, వారి కోసం గాలిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. తన ఇంటికి వెళుతున్న యువతిని బలవంతంగా పొలాల్లోకి తీసుకెళ్లిన రాజన్ గౌతమ్, అతని నలుగురు స్నేహితులతో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా, ఈ అఘాయిత్యాన్ని మొబైల్ ఫోన్లలో వీడియో తీశారు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే.. తన కుటుంబాన్ని చంపుతామని బాధితురాలిని హెచ్చరించారు.

Politician's son gangrapes girl with 4 friends, puts obscene video online

దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కాగా, నిందితులు రేప్ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోను బాధితురాలి సోదరుడు చూసి, ప్రశ్నించగా.. బాధితురాలు జరిగిన ఘటన గురించి తెలిపింది.

దీంతో బాధితురాలితో కలిసి సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు. కాగా, కేసును ఉపసంహరించుకోవాలని నిందితుల నుంచి బాధితురాలి కుటుంబానికి పలుమార్లు హెచ్చరికలు వచ్చాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రధాన నిందితుడ్ని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+