ప్రచారం చేసి.. మిస్ చేసిన విరాట్ కోహ్లీ, అనుష్క కూడా

ముంబై: భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తన ఓటు హక్కును వినియోగించుకోలేదట. ఏప్రిల్ 10వ తేదీన ఆయన భారత దేశంలోనే ఉన్నప్పటికీ ఓటు మాత్రం వేయలేదట.

2012 సంవత్సరంలో విరాట్ కోహ్లీ తన మిడల్ ఫింగర్ చూపించి ఐసిసి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డాడు. ఇప్పుడు.. పోల్ అంబాసిడర్ అయినప్పటికీ అతను మాత్రం ఓటు వేయక పోవడం విమర్శలకు తావిచ్చింది.

నిరుడు ఢిల్లీ ఎన్నికల సమయంలో ఆయన ఓటు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ ఏడాది కొత్త ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు అంబాసిడర్‌గా ఉన్నారు.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

ప్రస్తుతం కోహ్లీ ఐపిఎల్ 7 కోసం యుఏఈలో ఉన్నాడు. కోహ్లీ కోచ్ చెప్పిన సమాచారం మేరకు... ఏప్రిల్ 10వ తేదీన అతను బెంగళూరులో ఉన్నాడు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి కోహ్లీ ఆసక్తి చూపారని కానీ, అతను అప్పుడు ఢిల్లీలో లేరని చెప్పారు.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

అయితే, సచిన్ టెండుల్కర్ వంటి క్రికెట్ దిగ్గడం ఓటు వేసేందుకు విదేశాల నుండి వచ్చాడని, కోహ్లీ భారత్‌లోనే ఉన్నప్పటికీ ఓటు హక్కును వినియోగించుకోలేదని అంటున్నారు. ఓటు వేసేందుకు కొన్ని గంటల సమయాన్ని కూడా వెచ్చించలేక పోయారా అంటున్నారు.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

ఎన్నికలలో ఓటు వేయడం ప్రతి వ్యక్తి బాధ్యత అయినప్పటికీ... వేయడం, వేయకపోవడం వారిష్టమే అంటున్నారు. అయితే, కోహ్లీ ప్రచారకర్త అయి ఉండి కూడా ఓటు వేయక పోవడం సరికాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తన ఓటు హక్కును వినియోగించుకోలేదట. ఏప్రిల్ 10వ తేదీన ఆయన భారత దేశంలోనే ఉన్నప్పటికీ ఓటు మాత్రం వేయలేదట.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

మరో ఆసక్తికరమై విషయమేమంటే... విరాట్ కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఆమె రాజస్థాన్‌లో సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+