వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యప్రదేశ్, మిజోరంలో ప్రారంభమైన పోలింగ్.. ఇక మిగిలింది తెలంగాణ, రాజస్థాన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Madhya Pradesh, Mizoram Elections 2018 : మధ్యప్రదేశ్, మిజోరంలో ప్రారంభమైన పోలింగ్ | Oneindia Telugu

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బుధవారం మధ్యప్రదేశ్, మిజోరంలలో పోలింగ్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ లోని 230 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 2,899 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పోలింగ్ కోసం 65 వేల బూత్ లు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మిజోరంలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించడానికి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. 40 స్థానాలకు గాను 209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కోసం 1,164 బూత్ లు ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

Polling began in Madhya Pradesh and Mizoram

బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈనెల 12, 20 తేదీల్లో రెండు విడతలుగా ఛత్తీస్ గఢ్ లో ఎన్నికలు జరిగాయి. బుధవారం మధ్యప్రదేశ్, మిజోరంలలో పోలింగ్ పూర్తవుతుంది. ఇక తెలంగాణ, రాజస్థాన్ ఎన్నికలు డిసెంబర్ 7న జరగనున్నాయి. అయితే ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు డిసెంబర్ 11న వెలువడనున్నాయి.

English summary
Polling began in Madhya Pradesh and Mizoram on Wednesday following the election of five states. 2,899 candidates are in the fray for 230 assembly segments in Madhya Pradesh. The polling began at 7 am in Mizoram. 209 candidates are in the fray for 40 seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X