వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊపిరాడక తల్ల‘ఢిల్లీ’తోంది: రేపట్నుంచి పాఠశాలలు బంద్, కేజ్రీవాల్ ఏడాది గడువు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గాలి కాలుష్యం ప్రమాదకరస్థాయిలోనే కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్య పరిస్థితి మెరుగుపడేంత వరకు రేపటి(శనివారం) నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం ఆదేశించింది. అంతేగాక, గాలి కాలుష్యానికి తమను బాధ్యులను చేయొద్దని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పేర్కొంది.

 తమను బ్లేమ్ చేయొద్దంటూ అరవింద్ కేజ్రీవాల్

తమను బ్లేమ్ చేయొద్దంటూ అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ కాలుష్యానికి పంజాబ్ రాష్ట్రంలో పంట కోసిన అనంతరం పొలాల్లో మంట పెట్టడమే కారణమంటూ నిందలు వేయొద్దని అన్నారు. క్షీణిస్తున్న గాలి నాణ్యత, కాలుష్య స్థాయిలు మొత్తం ఉత్తర భారతదేశానికి సంబంధించిన సమస్య అని, దీన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అయితే, గతంలో కేజ్రీవాల్ పంజాబ్ సర్కారును నిందించడం గమనార్హం. తాజాగా కేజ్రీవాల్ చసిన వ్యాఖ్యలకు ఆ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే ఉండటం కారణంగా తెలుస్తోంది.

 పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలే కాలుష్యానికి కారణం?

పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలే కాలుష్యానికి కారణం?

పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలే కాలుష్యానికి కారణం అనడం సరికాదని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.తనను లేదా పంజాబ్ ప్రభుత్వాన్ని నిందించడం వల్ల ప్రయోజనం లేదని సీఎం కేజ్రీవాల్ అన్నారు. అంతేగాక, కాలుష్య నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగానే ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తున్నామని, 5వ తరగతిపైన అన్ని తరగతులకు బహిరంగ కార్యకలాపాలను కూడా మూసివేస్తామని చెప్పారు.

ఢిల్లీలో మళ్లీ సరిబేసి విధానం?: కేజ్రవాల్ ఏడాది గడువు

ఢిల్లీలో మళ్లీ సరిబేసి విధానం?: కేజ్రవాల్ ఏడాది గడువు


వాహనాలకు సరి-బేసీ విధానాన్ని అమలు చేయాలా వద్దా? అనే అంశంపైనా చర్చిస్తున్నామని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కాగా, సీఎం కేజ్రీవాల్ వెంట పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఉన్నారు. పంజాబ్ రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఉంది కాబట్టే.. పొట్ట దగ్ధం కావడానికి తామే బాధ్యులం. అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆరు నెలలే కావస్తున్నా.. సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. పరిష్కారాలను కనుగొంటున్నాం. సమస్యను పరిష్కరించేందుకు తమకు ఏడాది సమయం ఇవ్వండి అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ చెప్పిన అంశాలతో భగవంత్ మాన్ ఏకీభవించారు. ఇప్పటికే పంచాయతీలు కూడా పొట్టచేత కాల్చడం ఆపాలని తీర్మానాలు చేశాయని, వచ్చే ఏడాది నవంబర్ లోగా పొట్టలు కాల్చడం తగ్గుతుందని పంజాబ్ సీఎం హామీ ఇచ్చారు. పొట్టను పూడ్చేందుకు 1.20 లక్షల యంత్రాలతో చర్యలు తీసుకుంటామన్నారు.

English summary
pollution crisis: All primary schools shut in Delhi from tomorrow, kejriwal promises on pollution control.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X