బిగ్ షాక్.. ఆ రాష్ట్రంలో ఎలక్షన్ రద్దు చేసిన హైకోర్టు.. ఏం జరిగింది..??

ఏప్రిల్ 9న మూడు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఈ మేరకు ఎన్నికల ప్రచారం ముగిసింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఇక అసోంలో హ్యాట్రిక్ విజయంపై బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారం చేపట్టింది. అలాగే 4 రాష్ట్రాలు, 1 కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే ఎన్నికలకు సంబంధించి మే 4న వెలువడనున్నాయి. ఇక ఏప్రిల్ 9 న ఈ మూడు రాష్ట్రాలతో పాటు గోవాలోని పోండా అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగనుంది.

అయితే చివరి నిమిషంలో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. గోవాలో ఏప్రిల్ 9న జరగాల్సిన పోండా ఉపఎన్నికను బాంబే హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన పోండా ఉపఎన్నిక నోటిఫికేషన్ చెల్లుబాటు కాదని సంచలన తీర్పును వెల్లడించింది. ప్రస్తుతం గోవా అసెంబ్లీ పదవీకాలం ముగియడానికి ఏడాది కంటే తక్కువ సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నిక నిర్వహించడం అనవసరమని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది.

అలాగే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఏదైనా రాష్ట్ర అసెంబ్లీ గడువు ఏడాదిలోపు ఉన్నప్పుడు ఉప ఎన్నిక నిర్వహించడం తప్పనిసరి కాదని బాంబై కోర్టు గుర్తు చేసింది. ఈ మేరకు ఇద్దరు ఓటర్లు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు బెంచ్ ఈ తీర్పును వెల్లడించింది. ఈ క్రమంలో జస్టిస్ వాల్మీకి మెనెజెస్, జస్టిస్ అమిత్ జంసదేకర్లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వుల్ని జారీ చేసింది.

Ponda By-Election Cancelled by Bombay High Court April 9 Polls Scrapped in Goa Ponda by-election

ఇక గతేడాది అక్టోబర్ లో పోండా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రవి నాయక్ మరణించడంతో ఆ నియోజకవర్గం ఖాళీ అయింది. అయితే మూడు రాష్ట్రాలతోపాటుగా ఈ నియోజకవర్గానికి కూడా ఏప్రిల్ 9 న పోలింగ్ నిర్వహించి మే 4 న ఫలితాలు వెల్లడి చేయాలని ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే తాజాగా బాంబే హైకోర్టు ధర్మాసనం ఈ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఇక గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 2027 లో ఎన్నికలు జరగాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+