హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుండె పగిలే విషాదం.. శవాన్ని స్వస్థలానికి తీసుకొచ్చే స్థోమత లేక.. ఆ కుటుంబం ఏం చేసిందంటే..

|
Google Oneindia TeluguNews

కరోనా లాక్ డౌన్ పేదల జీవితాలకు పెనుభారంగా మారింది. వైరస్‌పై పోరులో దేశమంతా ఐక్యంగా ఉందని దీపాలు వెలిగించి చెప్పినప్పటికీ.. పేద,ధనిక జీవితాల్లో వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్నత వర్గాలు,సంపన్న కుటుంబాలు.. లాక్ డౌన్ పీరియడ్‌లోనూ సులువుగా ఎమర్జెన్సీ పాసులు పొందుతున్నవేళ.. పేదల పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా ఉంది. బతుకుదెరువు కోసం నగరాలకు వలస వెళ్లిన పేదలు.. లాక్ డౌన్‌లో చిక్కుకుని అక్కడే ప్రాణాలు వదిలితే.. కనీసం మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చే స్తోమత కూడా లేని కుటుంబాలు కోకొల్లలు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఓ సంఘటన ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.

ఢిల్లీలో మృతి చెందిన వలస కార్మికుడు

ఢిల్లీలో మృతి చెందిన వలస కార్మికుడు

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన సునీల్(37) బతుకుదెరువు కోసం ఢిల్లీ వలస వెళ్లాడు. కొన్నాళ్లుగా అక్కడే పనిచేస్తూ స్వగ్రామంలో ఉన్న కుటుంబానికి డబ్బులు పంపిస్తున్నాడు. లాక్ డౌన్ వేళ ఢిల్లీలోనే చిక్కుకుపోయిన అతను ఏప్రిల్ 11న అనారోగ్యం బారినపడ్డాడు. దీంతో ఇంటి యజమానే అతన్ని బారా హిందురావు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే అతనికి కరోనా సోకిందేమోనన్న అనుమానంతో అక్కడినుంచి మరో మూడు ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. చివరకు సఫ్‌దర్‌గంజ్ ఆసుపత్రిలో అతన్ని చేర్చారు. కరోనా నెగటివ్‌గా తేలినప్పటికీ.. చికెన్ పాక్స్‌తో బాధపడుతూ ఏప్రిల్ 14న అతను మృతి చెందాడు.

కన్నీటిపర్యంతమైన కుటుంబం

కన్నీటిపర్యంతమైన కుటుంబం


సునీల్ మృతి విషయాన్ని ఇంటి యజమాని ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు చేరవేశాడు. ఆ మాట విని అతని కుటుంబానికి గుండె ఆగినంత పనైంది. ఆ తర్వాత ఆ యజమానిని ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా లాభం లేకపోయింది. అయితే సఫ్దర్ గంజ్ ఆసుపత్రి నుంచి ఓ పోలీస్ అధికారి ఫోన్ చేసి మాట్లాడాడు. ఢిల్లీకి వచ్చి సునీల్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటారా అని ఆరా తీశాడు. దాని గురించే గ్రామ పెద్దతో మాట్లాడుతున్నామని మృతుడి భార్య కన్నీటిపర్యంతమవుతూ బదులిచ్చారు.

తీసుకొచ్చే స్థోమత లేక..

తీసుకొచ్చే స్థోమత లేక..


సునీల్‌కు భార్య పూనమ్,ఐదుగురు పిల్లులు,తల్లిదండ్రులు ఉన్నారు. ఆ కుటుంబం కటిక పేదరికంలో ఉంది. అందునా లాక్ డౌన్ కావడంతో సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ఇలాంటి తరుణంలో ఇంటిని పోషించేవాడే ఇక లేడని తెలిసి కుటుంబమంతా తల్లడిల్లిపోయింది. ఢిల్లీ నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు గ్రామ పెద్దతో మాట్లాడారు. అయితే చేతిలో చిల్లి గవ్వ లేకపోవడం.. కనీసం రైలు ద్వారా వెళ్లే ఆప్షన్ కూడా లేకపోవడంతో.. ఇక తమవల్ల కాదని చేతులెత్తేశారు. దీంతో గ్రామ పెద్ద ఢిల్లీలోని ఆ పోలీస్ అధికారికి ఫోన్ చేసి.. మీరే అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పారు. ఇది తమకు సమ్మతమే అన్నట్టుగా సునీల్ భార్య సంతకం చేసిన డాక్యుమెంట్ కూడా వారికి పంపించారు.

దిష్టిబొమ్మకు అంత్యక్రియలు..

దిష్టిబొమ్మకు అంత్యక్రియలు..


ఇన్నాళ్లు తమను పోషించి.. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నవాడి ఆఖరి చూపుకు కూడా నోచుకోనందుకు ఆ కుటుంబం తీవ్ర క్షోభను అనుభవిస్తోంది. ప్రత్యక్షంగా అంత్యక్రియలు నిర్వహించలేకపోయినందునా.. దానికి బదులు ఓ దిష్టి బొమ్మకు తమ గ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. దాన్నే సునీల్ మృతదేహంగా భావించి చివరి కార్యక్రమాలు పూర్తి చేశారు. పూరి గుడిసెలో నివసించే ఆ కుటుంబానికి ఇప్పటికీ రేషన్ కార్డు లేదు. ఆ కుటుంబం గురించి తెలిసి స్థానిక ప్రభుత్వ అధికారి ఒకరు అక్కడికి వెళ్లారు. వారికి రేషన్ కార్డు,సునీల్ భార్యకు వితంతు పెన్షన్,గ్రామంలోనే పక్కా ఇల్లు నిర్మించేందుకు హామీ ఇచ్చారు. ఎన్ని హామిలిచ్చినా ఇప్పుడిక తమవాడిని ఇక తిరిగి తీసుకురాలేము కదా అని ఆ కుటుంబం తీవ్ర ఆవేదన చెందుతోంది.

English summary
A family of a 37-year-old daily wage labourer who died due to chicken pox in Delhi, had to perform his last rites a few day ago using a symbolic straw dummy in their village. His body is in Delhi and his poverty-stricken family has no means to bring it back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X