Chandrika Saha: కొడుకును నేలకేసి బాదిన ప్రముఖ నటి భర్త.. కేసు నమోదు..

తల్లిదండ్రులకు పిల్లలంటే ప్రాణంగా చూస్తారు. వారికి ఏమైనా తట్టుకోలేరు. పిల్లలే జీవితంగా జీవిస్తారు. కానీ చోట ఓ రాక్షస తండ్రి కన్న కొడుకును నేలకేసి బాదాడు. అతను ఎవరో కాదు సిఐడి, అదాలత్, సావధాన్ వంటి ప్రముఖ క్రైమ్ సీరియళ్లతో మంచి పేరు తెచ్చుకున్న టెలివిజన్ నటి చంద్రికా సాహా భర్త. భర్త చేసిన పనికి షాకైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త అమన్ మిశ్రా తమ 15 నెలల మగబిడ్డపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడిన తన కొడుకును ఆమె ఆస్పత్రి చేర్చి చికిత్స అందిస్తోంది.

చంద్రికా సాహా గతంలో ఒకరిని పెళ్లాడి విడాకులిచ్చింది. ఆమెకు 2020లో వ్యాపారవేత్త అమన్‌ మిశ్రతో పరిచయం అయింది. దీంతో వారిద్దరూ సహజీవనం చేశారు. ఈ క్రమంలో చంద్రిక గర్భం దాల్చింది. అమన్ అబార్షన్‌ చేసుకోవాలని చంద్రికపై‌ ఒత్తిడి తెచ్చాడు. కానీ చంద్రిక మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వారిద్దరి మధ్య బేధాభిప్రాయాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే చంద్రిక, అమన్‌ గత నెలలో పెళ్లి చేసుకున్నారు. వీరు పెళ్లి చేసుకునే సమయానికి బాబు వయసు 14 నెలలు

Popular actress Chandri Sahas husband attacked his son in Mumbai

శుక్రవారం మే 5, 2023 నాడు చంద్రిక తన ఇంటి వంటగదిలో ఉన్నప్పుడు తన కొడుకు ఏడుపు విన్నారు. కొడుకును ఏడుస్తున్నాడు చూసుకో అని భర్త అమన్ చెప్పి వెళ్లింది చంద్రిక. అమన్ బాబును బెడ్ రూం లోకి తీసుకెళ్లి నేలకేసి కొట్టాడు. దీంతో బాబు బిగ్గర ఏడవడం మొదలు పెట్టాడు. వెంనటే వచ్చిన చంద్రిక కొడుకు గాయలైనట్లు గుర్తించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. చంద్రిక తన పసికందును ముంబైలోని మలాడ్ వెస్ట్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత రోజు చంద్రిక సిసీ కెమెరాలు దృశ్యాలు చూసి షాక్ అయింది.

తన భర్త అమన్ బాబును నేలకేసి కొడుతున్నట్లు వీడియో స్పష్టంగా కనిపించింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. చంద్రిక క్లోజ్డ్-సర్క్యూట్ టెలివిజన్ (CCTV) ఫుటేజీని ముంబైలోని బంగూర్ నగర్ పోలీసులకు సమర్పించింది. అమన్ బాబును ఒక్కసారి కాదు మూడుసార్లు నేలకెసి కొట్టాడు. పోలీసులు ఒకరి కస్టడీలో ఉన్న పిల్లలపై దాడి చేసినందుకు జువైనల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టం, 2015 సెక్షన్ 75 కింద అమన్ మిశ్రాపై కేసు నమోదు చేశారు. అమన్ మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+