వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోర్నోగ్రఫీ కేసు.. రాజ్ కుంద్రాకు మరోమారు చుక్కెదురు ; జైల్లో ఉండాల్సిందేనన్న బాంబే హైకోర్టు !!

|
Google Oneindia TeluguNews

ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు మళ్ళీ బెయిల్ లభించలేదు. ఇప్పటికి మూడు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించి ఆయన విఫలమయ్యారు. తాజాగా బాంబే హైకోర్టు ఈరోజు బెయిల్ నిరాకరించింది. పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా బాలీవుడ్ లోని మోడల్స్ తో పోర్న్ కంటెంట్ వీడియోలను తీసి యాప్ లలో అప్ లోడ్ చేస్తున్నట్టు పక్కా ఆధారాలతో గుర్తించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. దీంతో రాజ్ కుంద్రాకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత ఈ కేసులో విచారణ నిమిత్తం రాజ్ కుంద్రాను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఈ కేసులో అనేక కీలక విషయాలను గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

రాజ్ కుంద్రాకు సపోర్ట్ గా శిల్పాశెట్టి..ఆయన తీసినవి పోర్న్ వీడియోలు కాదు: పోలీసులకు వాంగ్మూలంరాజ్ కుంద్రాకు సపోర్ట్ గా శిల్పాశెట్టి..ఆయన తీసినవి పోర్న్ వీడియోలు కాదు: పోలీసులకు వాంగ్మూలం

మెజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ ను సవాల్ చేసిన రాజ్ కుంద్రా.. రిపోర్ట్ ను సమర్ధించిన కోర్టు

మెజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ ను సవాల్ చేసిన రాజ్ కుంద్రా.. రిపోర్ట్ ను సమర్ధించిన కోర్టు

రోజుకో కొత్త విషయాలు ఈ కేసులో వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఆయనకు మరింత ఉచ్చు బిగుస్తుంది. తమకు బెయిల్ కావాలని, తమను చట్టానికి విరుద్ధంగా అక్రమంగా అరెస్టు చేశారని కోర్టులను ఆశ్రయిస్తున్న రాజ్ కుంద్రాకు కోర్టులు వరుసగా షాక్ ఇస్తున్నాయి. తాజాగా బాంబే హైకోర్టులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం తన నిర్బంధానికి ముందు తనకు నోటీసు ఇవ్వలేదని మేజిస్ట్రేట్ కోర్టు తనపై జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వును ఆయన సవాలు చేశారు. అయితే జులై 20 న రాజ్ కుంద్రాను పోలీసు కస్టడీకి రిమాండ్ చేసినప్పుడు మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశంలో తప్పు లేదని ఈరోజు హైకోర్టు ఉత్తర్వు పేర్కొంది. రాజ్ కుంద్రా పిటీషన్ ను కొట్టివేసింది. దీంతో ఆయనకు మరో షాక్ తగిలినట్టయ్యింది .

ముంబై సెషన్స్ కోర్టులోనూ బెయిల్ కోసం పిటీషన్ .. ఆగస్ట్ 10న విచారణ

ముంబై సెషన్స్ కోర్టులోనూ బెయిల్ కోసం పిటీషన్ .. ఆగస్ట్ 10న విచారణ

వ్యాపారవేత్త రాజ్ కుంద్రా, తన అసోసియేట్ ర్యాన్ థోర్ప్‌ తో పాటు, జూలై 19 న అశ్లీల వీడియోల నిర్మాణంలో పాలుపంచుకున్నందుకు అరెస్టు చేయబడ్డారు. అయితే, తాము తీసిన కంటెంట్ అశ్లీలత కాదని , తాము తీసేది పోర్న్ కాదని , ఎరాటికా అని అది కేవలం శృంగారం మాత్రమేనని ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ఇలాంటి మెటీరియల్ అందుబాటులో ఉందని ఆయన తరపు న్యాయవాది వాదించారు. అరెస్ట్ అయినప్పటి నుండి అనేక సార్లు దరఖాస్తు చేసినప్పటికీ కోర్టులు ఇప్పటి వరకు రాజ్ కుంద్రాకు బెయిల్ నిరాకరిస్తూనే ఉన్నాయి.ఇదిలా ఉంటే అశ్లీల వీడియోల నిర్మాణం ప్రచారం కేసులో ముంబై సెషన్స్ కోర్ట్ రాజ్ కుంద్రా అతని సహచరుడు ర్యాన్ థోర్ప్‌ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఆగస్టు 10న వాదనలు వింటామని ముంబై సెషన్స్ కోర్టు ఇప్పటికే వెల్లడించింది.

Recommended Video

Jagga Reddy Arrest at Indira Park for Meeting organized at Indira Park | Oneindia Telugu
రాజ్ కుంద్రా బయటకు రాకుండా పోలీసుల వాదన.. వరుసగా కోర్టుల్లో కుంద్రాకు చుక్కెదురు

రాజ్ కుంద్రా బయటకు రాకుండా పోలీసుల వాదన.. వరుసగా కోర్టుల్లో కుంద్రాకు చుక్కెదురు

ఇక ఈ వ్యవహారంలో ముంబై పోలీసుల స్పందన తెలపాలంటూ ఆదేశించింది. ప్రస్తుతం వారిద్దరూ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ప్పటికే పలుమార్లు వారి బెయిల్ కోసం కోర్టులను అభ్యర్థించినప్పటికీ వారికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, కేసును తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని ముంబై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మరింత మంది సాక్షుల విచారణ జరపాల్సి ఉందని చెప్తున్నారు. అంతే కాదు వారు చేసిన పని సమాజానికి చాలా హానికరమైన పనిగా పోలీసులు కోర్టు దృష్టికి తీసుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా, అతని సహచరుడు ర్యాన్ థోర్ప్‌ బెయిల్ కోసం ఏ కోర్టుకు వెళ్లినా చుక్కెదురే అవుతోంది.

English summary
The courts have consistently given a shock to Raj Kundra, who has approached the courts seeking bail and illegally arresting himself. He recently challenged a remand order issued against him by a magistrate court in the Bombay High Court for failing to give him notice before his detention under the Code of Criminal Procedure. However, the High Court today said that the magistrate's order was not erroneous when Raj Kundra was remanded in police custody on July 20. bombay high court dismissed Raj kundra petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X