జైల్లో ధ్వంసం, కాగితాలకు నిప్పు: మళ్లీ వార్తల్లోకి ఇంద్రాణీ
తన కూతురు షీనా బోరాను హత్య చేసిన కేసులో ముంబైలోని బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
ముంబై: తన కూతురు షీనా బోరాను హత్య చేసిన కేసులో ముంబైలోని బైకుల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణి ముఖర్జియా మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
జైల్లో గుడ్లను దొంగిలించిందనే ఆరోపణలతో ఓ మహిళా ఖైదీని జైలు అధికారులు తీవ్రంగా కొట్టిన ఘటనలో సదరు మహిళ మృతి చెందింది.
దీంతో జైలు అధికారుల అమానుష ప్రవర్తన పట్ల ఇంద్రాణితో పాటు జైల్లో ఉన్న దాదాపు 200 మంది మహిళా ఖైదీలు ఆందోళనకు దిగారు. జైల్లోని వస్తువులను ధ్వంసం చేశారు. కాగితాలకు నిప్పుపెట్టారు.

తమను అడ్డుకున్న అధికారులపై దాడికి దిగారు. ఈ నేపథ్యంలో, ఇంద్రాణితో పాటు మరో 200 మంది ఖైదీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, మహిళా ఖైదీ మృతి ఘటనకు సంబంధించి ఇప్పటికే ఐదుగురు జైలు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో 2015లో ఇంద్రాణి అరెస్టయిన విషయం తెలిసిందే. మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్‌లతో కలిసి షీనా దారుణంగా ఇంద్రాణి హత్య చేసి శిక్ష ఎదుర్కొంటున్నారు. ఇంద్రాణి భర్త, ప్రముఖ వ్యాపార వేత్త పీటర్ ముఖర్జియా కూడా ఇదే కేసులో జైలుపాలయ్యారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications