నల్లధనం మిగలకపోవచ్చు!: మోడీ లెక్క తప్పిందా?

న్యూఢిల్లీ: నోట్ల రద్దు పైన ప్రధాని నరేంద్ర మోడీ లెక్క తప్పిందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వానికి భారీ ఆశాభంగం తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. నల్లధనం వెలికి తీయడం, క్యాష్‌లెస్ కంట్రీ వైపు నడిపించేందుకు మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వం అంచనాలు ఫలిస్తే ప్రభుత్వ ఖజానాకు దాదాపు నాలుగైదు లక్షల కోట్ల రూపాయల మేర లాభం కలిగేదని, కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అంత లేదని విశ్లేషకులు భావిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

చలామణిలో ఉన్న పెద్ద నోట్ల విలువ

చలామణిలో ఉన్న పెద్ద నోట్ల విలువ

రద్దు నిర్ణయానికి ముందు దేశంలో 1716.5 కోట్ల 500 రూపాయల నోట్లు, 685.8 కోట్ల 1000 రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి ఉమ్మడి విలువ 15.44 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో రూ.500 నోట్ల వాటా 8.58 లక్షల కోట్ల రూపాయలు. 1000 రూపాయల నోట్ల వాటా రూ.6.86 లక్షల కోట్లు.

నల్లధనంపై..

నల్లధనంపై..

వీటిలో 12 లక్షల కోట్ల వరకు డిపాజిట్ల ద్వారా వస్తాయని ప్రభుత్వం భావించింది. మరోవైపు దాదాపు నాలుగైదు లక్షల కోట్ల రూపాయల నల్లధనం బయటకు రాదని ప్రభుత్వం భావించి ఉంటుందని అంటున్నారు. అలా, బ్యాంకుల్లోకి రాకుండా బ్లాక్ హోల్డర్స్ చేతుల్లోని కరెన్సీ అంతా ఆర్బీఐ ఖాతాల్లో లాభంగా మిగులుతుందట. దీనిని ప్రభుత్వం డివిడెండ్‍‌గా బదలాయిస్తుందంటున్నారు.

డిపాజిట్ వాస్తవాలు

డిపాజిట్ వాస్తవాలు

అయితే, డిపాజిట్ వాస్తవాలను చూస్తే మాత్రం ప్రభుత్వం లెక్కలు బెడిసికొట్టేలా కనిపిస్తున్నాయని అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నవంబర్‌ 10 నుంచి నవంబర్‌ 27 మధ్య 18 రోజుల్లో రూ.8.45 లక్షల కోట్ల విలువైన రద్దయిన కరెన్సీ డిపాజిట్‌ అయింది.

అవి లెక్కలోకి తీసుకుంటే..

అవి లెక్కలోకి తీసుకుంటే..

ఆ తర్వాతవి కూడా లెక్కలోకి తీసుకుంటే మొత్తంగా రూ.10 లక్షల కోట్లు జమ అయి ఉంటాయి. ఆర్బీఐ వద్ద సీఆర్ఆర్ నిధుల కింద నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. ఇవి కలిపితే పద్నాలుగు లక్షలకు చేరుకుంటుంది. దీంతో మార్కెట్లో

నోట్ల రద్దు తర్వాత, బంగారం

నోట్ల రద్దు తర్వాత, బంగారం

మరోవైపు, తొలుత నోట్ల రద్దు విషయంలో ప్రజలు స్వాగతించారు. ఇబ్బందులు ఎదురైనప్పటికీ చాలామంది స్వాగతించారు. అయితే, ఆ తర్వాత బంగారం పైన తీసుకున్న నిర్ణయం మోడీ ప్రభుత్వానికి షాకిచ్చేలా కనిపిస్తోంది. బంగారం జోలికి రావొద్దని చాలామంది చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+