వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీదేవి బౌతిక కాయం తరలింపుకు ఆలస్యం, ఎందుకంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దుబాయ్‌లో మరణించిన ప్రముఖ నటి శ్రీదేవి మృతదేహనికి పోస్టు‌మార్టం పూర్తైంది. శనివారం రాత్రి శ్రీదేవి గుండెపోటుతో మరణించారు. దుబాయ్‌లోని రషీద్‌ ఆసుపత్రిలో ఇప్పటికే శ్రీదేవి పోస్టుమార్టం పూర్తయింది. ఇంకా దానికి సంబంధించిన నివేధిక రావాల్సి ఉంది. డెత్‌ సర్టిఫికేట్‌ ఆలస్యంగా విడుదల చేయనున్నారు. దౌత్య వ్యవహారాల కారణంగా భౌతికాయం తరలింపు ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు.

Recommended Video

శ్రీదేవీ జీవితంలో కీలకఘట్టాలు...!

శ్రీదేవి భౌతికాయం కోసం బంధువులు, అభిమానులు ముంబైలో ఎదురుచూస్తున్నారు. శ్రీదేవిని కడసారి చూసేందుకు పలువురు సినీ రంగ ప్రముఖులు ముంబైకి చేరుకొంటున్నారు. ఇప్పటికే శ్రీదేవి పార్థివ దేహన్ని హైద్రాబాద్‌కు తరలించేందుకు అంబానీ ప్రత్యేకంగా విమానాన్ని దుబాయ్‌కి పంపారు.

దుబాయ్‌ నుండి శ్రీదేవి పార్థీవ దేహం ముంబైకి తరలించగానే అంత్యక్రియలను నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తమ అభిమాన తారను కడసారి చూసేందుకు అభిమానులు ముంబైకి చేరుకొంటున్నారు. మరోవైపు సినీ ప్రముఖులు కూడ ఒక్కొక్కరుగా ముంబైకి వస్తున్నారు.

శ్రీదేవికి అందమే శాపమైందా,అవే ప్రాణాలకు ముప్పు తెచ్చాయా? శ్రీదేవికి అందమే శాపమైందా,అవే ప్రాణాలకు ముప్పు తెచ్చాయా?

శ్రీదేవి భౌతికకాయానికి పోస్ట్ మార్టమ్ పూర్తి

శ్రీదేవి భౌతికకాయానికి పోస్ట్ మార్టమ్ పూర్తి

శ్రీదేవి భౌతిక కాయానికి పోస్ట్ మార్టమ్ పూర్తైంది.అయితే దౌత్యపరమైన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.ఈ ప్రక్రియ పూర్తైతే శ్రీదేవి భౌతిక కాయాన్ని దుబాయ్ నుండి ఇండియాకు తీసుకురావచ్చు. అయితే ఈ ప్రక్రియ కోసం ఇండియా అధికారులు దుబాయ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నేటి సాయంత్రం ముంబైకి శ్రీదేవి పార్థీవ దేహం

నేటి సాయంత్రం ముంబైకి శ్రీదేవి పార్థీవ దేహం

దుబాయ్‌లో మరణించిన శ్రీదేవి పార్ధీవ దేహన్ని ముంబైకి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, కొన్ని దౌత్యపరమైన ఇబ్బందుల కారణంగా పార్థీవదేహం ముంబైకి రావడానికి ఆలస్యమౌతోందని అధికారులు చెబుతున్నారు. ఉదయం పద కొండు గంటలకు డెత్ సర్టిఫికెట్ జారీ చేసే అవకాశాలున్నాయి. ఈ సర్టిఫికెట్ జారీ చేసిన తర్వాత ఎంబాల్మింగ్ నిర్వహించనున్నారు.ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి కనీసం రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీని తర్వాత పాస్‌పోర్ట్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేయడానికి సోమవారం మధ్యాహ్నం దాటే అవకాశం ఉంది. అన్ని సకాలంలో పూర్తైతే సోమవారం సాయత్రం లేదా రాత్రికి ముంబైకి శ్రీదేవి పార్ధీవ దేహం చేరే అవకాశం ఉంది

శ్రీదేవి ఇంటికి చేరుకొంటున్న అభిమానులు

శ్రీదేవి ఇంటికి చేరుకొంటున్న అభిమానులు

అందాల నటి శ్రీదేవి మరణించిన విషయాన్ని తట్టుకోలేక ఆమెను చివరిసారి చూసేందుకు ఆమె అభిమానులు ఆమె ఇంటి వద్దకు వస్తున్నారు. అయితే దుబాయ్ నుండి పార్థీవ దేహం వచ్చేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని తెలిసి అభిమానులు నిరాశ చెందుతున్నారు. శ్రీదేవి పార్థీవ దేహన్ని ఇంటి నుంచి మెహబూబా స్టూటియోకు పార్థివదేహాన్ని తరలిస్తారు అక్కడి నుండి నేరుగా జుహూలోని శాంతా క్రజ్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి తమ అభిమాన తారను చివరిసారిగా చూడాలన్న ఆత్రుతతో శ్రీదేవి ఇంటి ముందు అభిమానులు పోటెత్తారు.దీంతో ముంబైలోని చార్‌బంగ్లా పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

ముంబైకి సినీ ప్రముఖులు

ముంబైకి సినీ ప్రముఖులు

శ్రీదేవి పార్ధీవ దేహన్ని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు ముంబైకి చేరుకొంటున్నారు. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ముంబైకి చేరుకొన్నారు. తెలుగు, మళయాల, తమిళ, హిందీ సినీ రంగాలకు చెందిన ప్రముఖులు కూడ శ్రీదేవి భౌతికకాయాన్ని కడసారి దర్శించుకొనేందుకు ముంబైకి వస్తున్నారు. ముంబైలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

English summary
The family of Sridevi, a Bollywood actress described as India’s first female superstar, said they are devastated by her death.The movie star is believed to have died of a massive heart attack in Dubai on Saturday night. She was visiting the emirate after attending a nephew’s wedding in Ras Al Khaimah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X