వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో ఇక ‘అందరికీ 24గంటల విద్యుత్’

ఇక నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా అందరికీ విద్యుత్ అమలు కానుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న యోగి ఆదిత్యనాథ్ మరో ముందడుగు వేశారు. అదేమంటే.. ఇక నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా అందరికీ విద్యుత్ అమలు కానుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో యూపీలో కూడా అందరికీ 24గంటల విద్యుత్ అమల్లోకి వచ్చింది.

యూపీ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ, యూపీ ఎనర్జీ మినిష్టర్ శ్రీకాంత్, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్‌లు కూడా ఒప్పంద సమయంలో సీఎం యోగి వెంట ఉన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం యూపీ సర్కారు 1911 అనే హెల్ప్ లైన్ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది.

yogi adityanath

యూపీ పవర్ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.331.69కోట్లతో 8 సబ్ స్టేషన్లను, 75.60కోట్లతో మరో 12సబ్ స్టేషన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. ఈఈఎస్ఎల్ కింద 10వేల విద్యుత్ సామర్థ్యం సోలార్ ప్యానెళ్లను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. అంతేగాక, ఈ బుగ్తాన్ ద్వారా డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించేందుకు గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకువస్తున్నారు.

ఏప్రిల్ 11న జరిగిన రెండో కేబినెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్.. గ్రామాల్లో 18గంటలు, పట్టణాల్లో 20గంటల విద్యుత్ అందించాలని ఆదేశించారు. 2019 వరకు యూపీలోని ప్రతీ గ్రామానికి విద్యుత్ అందించాలనే తమ లక్ష్యంతో కేంద్రంతో కుదుర్చుకున్న అందరికీ విద్యుత్‌తో చేరుకుంటుందని అన్నారు. కాగా, ఇప్పటి వరకు యూపీ మాత్రమే అందరికీ 24 గంటల విద్యుత్ పథకంలోకి రాలేదు. ఇప్పుడు యోగి నేతృత్వంలో యూపీ కూడా చేరింది.

English summary
The Uttar Pradesh government and the Centre today entered into an agreement which promises to provide 24x7 power supply to all the households in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X