Power: చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ?, పదవికి గుడ్ బై మామ, పేసీఎం, లేదా పే పీఎం ?

బెంగళూరు/దావణగెరె: కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి లోకాయుక్త పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో, మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న అధికార పార్టీ బీజేపీకి లోకాయుక్త ఇచ్చిన ఝలక్ తో ప్రతిపక్షాల చేతికి మంచి అస్త్రం చిక్కింది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నారు అనే సామెత లాగా అక్షరాలా ఇప్పుడు కొడుకు లోకాయుక్త వలలో చిక్కుకున్న తరువాత అధికార పార్టీ ఎమ్మెల్యే. బీజేపీ సీనియర్ నాయకుడు అయిన మాడాల్ విరుపాక్షప్ప కేఎస్ డీఐ పదవికి రాజీనామా చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఆరు కోట్ల రుపాయల డబ్బులు పేసీఎంకా, పే పీఎంకా అంటూ కాంగ్రెస్ అప్పుడే విమర్శలు మొదలుపెట్టింది.

జస్ట్ ఝలక్


కర్ణాటకలోని కేఎస్ డీల్ అధ్యక్షుడి స్థానంలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే మాడాల్ విరుపాక్షప్ప (బీజేపీ)ని అడ్డం పెట్టుకుని ఆడుతున్న ఆయన కొడుకు, ప్రభుత్వ ఉద్యోగి ప్రశాంత్ మీద లోకాయుక్త అధికారులు పంజా విసడంతో కన్నడిగులు ఉలిక్కిపడ్డారు. ఒక కాంట్రాక్టు ఇచ్చే విషయంలో రూ. 40 లక్షలు లంచం తీసుంటూ ఎమ్మెల్యే విరుపాక్షప్ప కొడుకు ప్రశాంత్ లోకాయుక్త పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు.

నీ జీతం ఎంత.... ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ?

ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ప్రశాంత్ బెంగళూరులో ఓ ప్రైవైట్ ఆఫీసు ఏర్పాటు చేసుకున్నాడు. అదే ప్రైవేట్ ఆఫీసులో రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ ప్రశాంత్ అడ్డంగా లోకాయుక్త అధికారులకు చిక్కిపోయాడు. నీ జీతం ఎంత అని లోకాయుక్త అధికారులు ప్రశాంత్ ను ప్రశ్నించారు. ఇంత డబ్బులు నీకు ఎక్కడి నుంచి వచ్చింది ?, నీకు ఈ డబ్బులు ఎవరు ఇచ్చారు అంటే ప్రశాంత్ దగ్గర ఎలాంటి సమాధానం లేదు.

సార్ పరుగో పరుగు

సార్ పరుగో పరుగు

బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని ప్రశాంత్ ఇంటికి అతన్ని పిలుచుకుని వెళ్లారు. ప్రశాంత్ ఇంటిలో సోదాలు చేసిన లోకాయుక్త అధికారులు రూ. 6 కోట్లకు పైగా నగదు (లిక్విడ్ క్యాష్) స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కొడుకు ప్రశాంత్ లోకాయుక్త వలలో పడ్డాడని తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే విరుపాక్షప్ప మడాల్ బెంగళూరుకు పరుగు తీశారు. అయితే అప్పటికే అంతా జరిగిపోవడంతో బీజేపీ ఎమ్మెల్యే విరుపాక్షప్ప ఏమీ చెయ్యలేకపోయారు.

సీఎం సీరియస్

సీఎం సీరియస్


అధికార పార్టీ ఎమ్మెల్యే మాడల్ విరుపాక్షప్ప కుమారుడు, పైగా ప్రభుత్వ ఉద్యోగి అయిన ప్రశాంత్ ఒకేసారి రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు చిక్కిపోవడంతో కర్ణాటకలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం బసవరాజ్ బోమ్మయ్ కి ఈ విషయంలో మండిపోయిందని తెలిసింది. వెంటనే విరుపాక్షప్పకు ఫోన్ చేసిన సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆయనకు క్లాస్ పీకి వివరణ కోరారణని తెలిసింది.

మళ్లీ తెరమీదకు పే సీఎం..... పే పీఎం నినాదాలు

మళ్లీ తెరమీదకు పే సీఎం..... పే పీఎం నినాదాలు


చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నారు అనే సామెత లాగా అక్షరాలా ఇప్పుడు కొడుకు ప్రశాంత్ లోకాయుక్త వలలో చిక్కుకున్న తరువాత కర్ణాటకలో అధికార పార్టీ ఎమ్మెల్యే. బీజేపీ సీనియర్ నాయకుడు అయిన మాడాల్ విరుపాక్షప్ప కేఎస్ డీఐ పదవికి రాజీనామా చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఆరు కోట్ల రుపాయల డబ్బులు పేసీఎంకా, పే పీఎంకా అంటూ కాంగ్రెస్ పార్టీ అప్పుడే విమర్శలు మొదలుపెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+